Share News

Chittoor Ambedkar Statue Fire: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు

ABN , Publish Date - Oct 03 , 2025 | 08:19 AM

చిత్తూరు జిల్లా దేవలంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది.

Chittoor Ambedkar Statue Fire: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు
Chittoor Ambedkar Statue Fire

చిత్తూరు జిల్లా: వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనతో స్థానిక దళిత సంఘాలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


దళిత నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దళితుల ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read:

వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

రోజుకు 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? ఆరోగ్యానికి ముప్పే!

For More Latest News

Updated Date - Oct 03 , 2025 | 08:43 AM