Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..
ABN , Publish Date - Jul 25 , 2025 | 07:33 PM
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. భక్తులకు ఇకపై ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తామని స్పష్టం చేసింది.
తిరుపతి, జులై 25: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచన చేసింది. తిరుపతి అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో ప్రతీ రోజు నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లను ఇకపై ఆన్‌లైన్‌లో మాత్రమే జారీ చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఇది ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రతి రోజు 200 టికెట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో జారీ చేయాలని నిర్ణయించినట్లు వివరించింది.
ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాలని సూచించింది టీటీడీ. ఈ టికెట్ల ద్వారా రూ.1600/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) విశేష హోమంలో పాల్గొనవచ్చని పేర్కొంది. హోమంలో పాల్గొన్న గృహస్తులకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారని టీటీడీ విపులీకరించింది. అయితే గతంలో ప్రతీ రోజు భక్తులకు కరెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేసే వారమని ఈ సందర్భంగా గుర్తు చేసింది టీటీడీ.
తిరుమల క్యూలైన్‌లో దళారుల దందా..
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం సులభంగా చేయిస్తామంటూ కొందరు దళారులు ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా గుట్టును టీటీడీ విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో నిలబడకుండా నేరుగా స్వామివారి ఉచిత దర్శనం ఏర్పాటు చేయిస్తామంటూ సదరు ముఠా.. దాదాపు 25 మంది భక్తుల నుంచి (ఒక్కొక్క భక్తుడి నుంచి రూ.1500 వసూల్ చేసింది) వేలాది రూపాయిలు వసూల్ చేసింది. అనంతరం భద్రతా సిబ్బందితో ఈ ముఠా కుమ్మక్కై.. వారికి స్వామివారి దర్శనం చేయించినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ ముఠా సభ్యులతోపాటు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై వైఎస్ షర్మిల విమర్శలు
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..
For More Andhrapradesh News And Telugu News