Chittoor Road Accident : ప్రాణాలు తీసిన ఓవర్ టేకింగ్..!
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:03 AM
తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.

చిత్తూరు జిల్లాలో బస్సు, లారీ ఢీ
నలుగురు మృతి.. 10 మందికి గాయాలు
నగరి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా నగరి సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు తిరుపతి జిల్లాకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు తమిళనాడు వాసులు. ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని అరక్కోణం నుంచి తిరుపతికి ఓ ప్రైవేటు బస్సు బయలుదేరింది. నగరి సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తున్న వాహనాన్ని బస్సు ఓవర్ టేక్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు ఒక వైపు వెనుక సగభాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లా వడమాలపేట మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన పార్థసారథి నాయుడు (60) రాజేంద్రనాయుడు(54), తమిళనాడులోని తిరుత్తణికి చెందిన కుమార్(60), తిరువళ్లూరుకు చెందిన ధనుష్కోటి(12) మృతిచెందారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు నగరి ఏరియా వైద్యశాలకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News