Amaravati New Projects: అమరావతిలో రెండు కొత్త ప్రాజెక్టులు.. ఆమోదం తెలిపిన కేంద్రం
ABN , Publish Date - Jun 17 , 2025 | 07:00 PM
అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. 2018 నుంచి పెండింగులో ఉన్న రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. రూ 2,787 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ రెండు కొత్త ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. 2018 నుంచి పెండింగులో ఉన్న రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) తాజాగా ఆమోదం తెలిపింది. రూ 2,787 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ రెండు కొత్త ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. ఈ రెండు కొత్త ప్రాజెక్టుల్లో మొదటిది రూ. 1329 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించడం కాగా, మరొకటి రూ.1458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టడం (AP News).
ఈ రెండు ప్రాజెక్టులను సీపీడబ్ల్యూడీ నిర్మిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం తాజాగా ఆఫీసు మెమోరాండం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ ద్వారా వివరాలు వెల్లడించారు. 2018 నుంచి పెండింగులో ఉన్న ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసిందని హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News