Amarajeevi Potti Sriramulu Bronze Statue: అమరావతిలో అమరజీవి కాంస్య విగ్రహం
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:08 AM
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగువారికి దారిచూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్..
6.8 ఎకరాల్లో 58 అడుగుల ఎత్తున ఏర్పాటు
నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
రూ.కోటి విరాళం ప్రకటించిన మంత్రి టీజీ భరత్
తుళ్లూరు సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగువారికి దారిచూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు, పెదపరిమి మధ్య 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణాలకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుతో పాటు మొత్తం ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకోవాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేశ్‌కు సూచించారు. వచ్చే మార్చి 16 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని డూండి రాకేశ్ తెలిపారు. టీజీవీ గ్రూప్ తరపున విగ్రహం ఏర్పాటకు మొదటి విరాళం రూ.కోటి అందిస్తున్నామని మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. పొట్టి శ్రీరాములు వారసులు నలుగురిని శాలువాలతో లోకేశ్ సత్కరించారు మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, రాజధాని రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News