Share News

BJP Leader Vishnu Vardhan Reddy : ఢిల్లీలో ఆప్‌ది ముగిసిన అధ్యాయం

ABN , Publish Date - Feb 04 , 2025 | 05:01 AM

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీది ఇక ముగిసిన అధ్యాయమని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

BJP Leader Vishnu Vardhan Reddy : ఢిల్లీలో ఆప్‌ది ముగిసిన అధ్యాయం

  • చంద్రబాబుకు కృతజ్ఞతలు: విష్ణువర్ధన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీది ఇక ముగిసిన అధ్యాయమని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం చంద్రబాబును ఆయన అధికారిక నివాసం వన్‌ జన్‌పథ్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏపీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో ఆప్‌ ఇచ్చిన హామీలు అమలు చేయలేక విఫలమైంది. ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ మీద విమర్శలు చేస్తోంది. బిజీ షెడ్యూల్‌లో కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు, జనసేనఎంపీలు, నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రజలు గత రెండు ఎన్నికల్లో ఆప్‌కి మద్దతు ఇచ్చి మోసపోయామని చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీకి వాళ్లంతా అండగా నిలువబోతున్నారు’ అని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

Updated Date - Feb 04 , 2025 | 05:01 AM