Share News

Decline in Sales : కటకట.. కిటకిట!

ABN , Publish Date - Feb 17 , 2025 | 04:43 AM

ఆదివారం చికెన్‌ దుకాణాలపై ‘బర్డ్‌ఫ్లూ’ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్‌ వ్యాపారాలు డీలా పడి వ్యాపారులు కటకటలాడారు.

Decline in Sales : కటకట.. కిటకిట!

ABN AndhraJyothy : ఆదివారం తెల్లారితే చాలు.. చికెన్‌ షాపుల ముందు నాన్‌వెజ్‌ ప్రియులు క్యూకట్టేస్తారు. బోన్‌లెస్‌-బోన్‌విత్‌ అంటూ.. వ్యాపారులు సైతం క్షణం తీరిక లేకుండా గడిపేస్తారు! కానీ.. ఈ ఆదివారం చికెన్‌ దుకాణాలపై ‘బర్డ్‌ఫ్లూ’ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్‌ వ్యాపారాలు డీలా పడి వ్యాపారులు కటకటలాడారు. తిరుపతిలోని లీలామహల్‌ సర్కిల్‌లో ఉన్న చికెన్‌ దుకాణాలు.. కొనుగోలు దారులు లేక బోసి పోగా.. పక్కనే ఉన్న చేపల మార్కెట్‌ మాత్రం మాంసాహార ప్రియులతో కిటకిటలాడింది!!

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 17 , 2025 | 04:44 AM