Share News

Cinema Tickets Rates: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - May 14 , 2025 | 06:59 PM

Cinema Tickets Rates: వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరలపై రచ్చ రచ్చ జరిగింది. ఈ వ్యవహారంపై టాలీవుడ్‌లోని పలువురు హీరోలు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లి.. నాటి సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమై చర్చించారు.

Cinema Tickets Rates: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

అమ‌రావ‌తి, మే 14: సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధ‌ర‌ల ఖ‌రారుపై ఏపీ ప్రభుత్వం క‌మిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆదేశాల‌తో క‌మిటీ ఏర్పాటు చేస్తూ హోం శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కుమార్ విశ్వ‌జిత్ బుధవారం అమరావతిలో ఉత్త‌ర్వులు జారీ చేశారు. హోం శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి నేతృత్వంలో 5 మంది స‌భ్యుల‌తో క‌మిటి ఏర్పాటు చేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో స‌భ్యులుగా స‌మాచార, ఆర్ధిక శాఖ, న్యాయ శాఖల కార్య‌ద‌ర్శులతోపాటు సినీ నిర్మాత వివేక్ కుచిభ‌ట్ల‌ ఉండనున్నారు. సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచాలంటూ గ‌తంలో హైకోర్టులో పిటీష‌న్ దాఖలైన సంగతి తెలిసిందే.


ఈ ఏడాది సంక్రాంతి పండగ వేళ.. పలు సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాల బెనిఫిట్ షో వేసే క్రమంలో టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమాలకు బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వడం వల్ల శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకు వెళ్లారు.


మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరలపై రచ్చ రచ్చ జరిగింది. ఈ వ్యవహారంపై టాలీవుడ్‌లోని పలువురు హీరోలు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లి.. నాటి సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమై చర్చించారు. ఈ అంశం నాటి నుంచి తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్

Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ

Updated Date - May 14 , 2025 | 06:59 PM