CPI : ఆరోగ్యశ్రీ ఉన్నా డబ్బు వసూలు : సీపీఐ
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:43 AM
ఆరోగ్యశ్రీ ఉన్నా పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అక్ర మంగా డబ్బులు వసూసు చేస్తున్నా యని, వాటిపై చర్యలు తీసు కోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఇలా డబ్బులు డిమాండ్ చేసి, వారు ఇవ్వకపో వడంతో వైద్యం అందించకుండా పంపారంటూ బా ధితురాలితో కలిసి గురువారం స్థానిక డీఎం హెచఓ కార్యా యంవద్ద ఆందోళనకు దిగారు.

అనంతపురం టౌన, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ ఉన్నా పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అక్ర మంగా డబ్బులు వసూసు చేస్తున్నా యని, వాటిపై చర్యలు తీసు కోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఇలా డబ్బులు డిమాండ్ చేసి, వారు ఇవ్వకపో వడంతో వైద్యం అందించకుండా పంపారంటూ బా ధితురాలితో కలిసి గురువారం స్థానిక డీఎం హెచఓ కార్యా యంవద్ద ఆందోళనకు దిగారు. ఈ సంద ర్భంగా సీపీఐ నాయకులు రమణయ్య, శ్రీరా ములు, అల్లీపీరా, కృష్ణుడు తదితరులు మాట్లాడుతూ కిమ్స్ సవీరా ఆస్పత్రి యాజమాన్యం పేదల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా అదనంగా డబ్బులు ఇస్తేనే అక్కడ వైద్యం అందిస్తామంటున్నారని మండిపడ్డారు. గతనెలలో ఓ మహిళను ఇలాగే డబ్బు డిమాండ్ చేశారని, ఎందుకివ్వాలని ఆమె అడిగినందుకు వైద్యం చేయకుండా బయటకు పంపారన్నారు. ఆమె మరో ఆస్పత్రికి వెళ్లి వైద్యం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనిపై గ్రీవెన్సలో కలెక్టర్ ఫిర్యాదుచేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇటీవల కావేటి ఆస్పత్రిలో కూడా ఇలాగే అదనంగా డబ్బులు వసూలు చేసి కూడా, ఆరోగ్యశ్రీ అనుమతి రాలే దని నిర్తక్ష్యం చేయడంతో ఓ వ్యక్తి మర ణించాడన్నారు. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టరు కిరణ్‌కుమార్ రెడ్డి వారి వద్దకు వచ్చి, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఈశ్వరయ్య, వరలక్ష్మి, శీనా, జానకి, రాజు, నాగప్ప, మున్నా, ఖాజా, ఆనంద్, బాషా, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....