MLC Election : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:10 AM
పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతిస్తున్నట్లు ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీటీఎఫ్ అమరావతి, ఆప్టా తీర్మానం
ABN AndhrajYothy: పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతిస్తున్నట్లు ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరంలకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. అలాగే, గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్టా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు, కాకి ప్రకా్‌షరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర శాఖ తీర్మానం చేసిందన్నారు.