AP Tourism Anand Mahindra X Post AP CM replies : ఏపీ టూరిజంపై మీరన్నది నిజం.. ఆనంద్ మహీంద్రా పోస్ట్, సీఎం రిప్లై
ABN , Publish Date - Aug 24 , 2025 | 09:54 PM
ఆనంద్ మహీంద్రా, ఏపీ సీఎం మధ్య ఎక్స్‌లో ఆసక్తికర సంభాషణ జరిగింది. ఏపీలోని అద్భుతమైన టూరిజం స్పాట్స్‌ను ఉటంకిస్తూ ఏపీ సీఎం ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌కు ఆనంద్ సందేశం ఇవ్వగా, దానికి సీఎం రిప్లై..
ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 24: భారతదేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరు, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య సోషల్ మీడియా ఎక్స్ లో ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అద్భుతమైన టూరిజం స్పాట్స్ ను ఉటంకిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ఒక అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చారు. దీనికి ఆనంద్ మహీంద్రా బాగా ఆకర్షితుడయ్యారు.
తన అభిప్రాయాన్ని ఆనంద్ మహీంద్రా ఎక్స్ లో పొందుపరిచారు. ఆ పోస్ట్ లో సీఎం చంద్రబాబు, ఏపీ టూరిజం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'చంద్రబాబు గారూ మీ ప్రకటన చూశాను. మీరు చెప్పింది నిజమే. ఆంధ్రాలో చాలా వరకు సుందరమైన ప్రదేశాలు ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన బీచ్‌లకు మించి, నది ఎగువన కూడా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. పచ్చని కొబ్బరి తోటలు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్‌లు అందుబాటులో ఉన్నాయి.' అని ఆనంద్ మహీంద్రా అన్నారు.

అంతేకాదు, ఇదే సమయంలో తమ క్లబ్ మహీంద్రా గురించి కూడా ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. క్లబ్ మహీంద్రా గురించి తాను గర్వపడటానికి ఒక కారణం ఏమిటంటే, 'మేము మొదట్నుంచీ హాట్‌స్పాట్‌లలో కొత్త గమ్యస్థానాలను(డెస్టినేషన్స్) సృష్టించడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాం. ఆంధ్రాలో ప్రశాంతమైన బ్యాక్ వాటర్ రత్నం దిండి, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం - దిగ్గజం విక్టోరియా అమెజోనికాకు నిలయం, దీని ఆకులు దాదాపు 3 మీటర్లు విస్తరించి, పిల్లవాడిని పట్టుకునేంత దృఢంగా ఉంటాయి (నాల్గవ ఫోటోలో అతిథి సౌజన్ కన్న అందంగా బంధించారు). అంటూ ఆనంద్ మహీంద్రా సందేశమిచ్చారు.
దీనికి వెంటనే సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతానుంచి రిప్లై ఇచ్చారు. ఇందులో చంద్రబాబు ఏమని బదులిచ్చారంటే.. 'మీ సందేశానికి ధన్యవాదాలు. భవిష్యత్తుకు ఏకైక 'ఇజం' పర్యాటకం. ఇది ప్రజలను ఒకచోట చేర్చుతుంది. సంస్కృతులను కలుపుతుంది. జీవనోపాధిని సృష్టిస్తుంది. అంతేకాదు, లక్ష్యాలతో వృద్ధిని నడిపిస్తుంది. కొత్త గమ్యస్థానాలను సృష్టించాలనే మీ దార్శనికతను నేను అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో దిండి వంటి అనేక దాచిన రత్నాలు కనుగొనబడటానికి వేచి ఉన్నాయి. ఆధ్యాత్మిక వారసత్వం నుండి సుందరమైన తిరోగమనాల వరకు, మన రాష్ట్రం ప్రతి ప్రయాణికుడికి అనుభవాల నిధిని అందిస్తుంది. ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతించడంలో మాతో భాగస్వామ్యం కావాలని నేను మిమ్మల్ని, మీతో పాటు అన్ని ఆతిథ్య సంస్థల్నీ ఆహ్వానిస్తున్నాను.' అని చంద్రబాబు రిప్లై ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News