Share News

Ramesh Yadav insults CM: మండలిలో దుమారం.. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై ఆగ్రహం..

ABN , Publish Date - Sep 25 , 2025 | 01:51 PM

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది.

Ramesh Yadav insults CM: మండలిలో దుమారం.. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై ఆగ్రహం..
AP legislative council

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది. సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కుప్పం ఎమ్మెల్యే అని సంబోధించారు YCP MLA Ramesh Yadav insults CM).


రమేష్ యాదవ్ వ్యాఖ్యల కారణంగా టీడీపీ సభ్యలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీఎం చంద్రబాబు గురించి అగౌరవంగా మాట్లాడిన వైసీపీ సభ్యులతో క్షమాపణలు చెప్పించాలని మంత్రులు డిమాండ్ చేశారు (AP News). జగన్‍ను మాఫియా డాన్ అంటే ఒప్పుకుంటారా అని వైసీపీ సభ్యులను టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ గందరగోళం నేపథ్యంలో రికార్డుల పరిశీలన కోసం ఛైర్మన్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి..

మంత్రి సమాధానంతో అసంతృప్తి.. మండలి నుంచి బొత్స వాకౌట్

లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 01:51 PM