Share News

Business Expo 2025: సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం: మంత్రి కొల్లు రవీంద్ర..

ABN , Publish Date - Dec 14 , 2025 | 07:13 PM

రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అవసరాలను సద్వినియోగం చేసుకుందామని, అభివృద్ధికి తోడ్పాటు అందించే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దేశ అవసరాలు తీర్చేలా రాష్ట్ర మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

Business Expo 2025: సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం: మంత్రి కొల్లు రవీంద్ర..
AP Minister Kollu Ravindra

రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అవసరాలను సద్వినియోగం చేసుకుందామని, అభివృద్ధికి తోడ్పాటు అందించే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. దేశ అవసరాలు తీర్చేలా రాష్ట్ర మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేసుకుందామని, మన రాష్ట్రానికి సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, పోర్టులు, రైలు, రోడ్డు మార్గాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ ఎక్స్ పో ఈ రోజుతో ముగిసింది (AP Minister Kollu Ravindra).


బిజినెస్ ఎక్స్ పో-2025 ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. గత ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందుల కారణంగా అమరావతి నిర్మాణం ఆలస్యమైందని, ఇప్పుడు పనుల్లో వేగం పెరిగిందని,రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ప్రైవేటు సంస్థల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వ ఎప్పుడూ సిద్ధంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇప్పటికే 20 పాలసీలను ప్రభుత్వం ప్రకటించిందని, అందువల్లే విశాఖ సమ్మిట్‌లో ఏకంగా రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు (AP Chamber of Commerce).


ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతోందన్నారు (industry expo AP). అనుమతుల విషయంలో పాటిస్తున్న స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల క్యాలెండర్ మారే లోపు ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయని అన్నారు. ఫుడ్ పార్కులు, లాజిస్టిక్ పార్క్స్, టెంపుల్ టూరిజం, బ్యాక్ వాటర్స్ టూరిజం వంటి అభివృద్ధి అవకాశాలను యువ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఎప్పుడంటే..?

For More AP News And Telugu News

Updated Date - Dec 14 , 2025 | 07:14 PM