Share News

Health Association : ఏపీ మానసిక వైద్య నిపుణుల సంఘానికి అవార్డు

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:22 AM

మానసిక వైద్య నిపుణుల సంఘం వార్షిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానసిక వైద్యనిపుణుల సంఘం శాఖకు అత్యున్నత రాష్ట్ర శాఖగా అవార్డు- 2024 ప్రదానం చేశారు.

 Health Association : ఏపీ మానసిక వైద్య నిపుణుల సంఘానికి అవార్డు

  • ఐదు దశాబ్దాల్లో తొలిసారి ఉత్తమ శాఖగా ఎంపిక

గుంటూరు మెడికల్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో జనవరి 22 నుంచి 25వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి మానసిక వైద్య నిపుణుల సంఘం వార్షిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానసిక వైద్యనిపుణుల సంఘం శాఖకు అత్యున్నత రాష్ట్ర శాఖగా అవార్డు- 2024 ప్రదానం చేశారు. ఐదు దశాబ్దాల్లో తొలిసారిగా ఈ పురస్కారం ఏపీ శాఖకు దక్కింది. మానసిక ఆరోగ్యంపై ఉచిత వైద్య శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, వైజ్ఞానిక సదస్సులు నిర్వహించడంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందంజలో నిలవడంతో ఈ అవార్డు దక్కింది. రెండేళ్లుగా అనంతపురంలో డాక్టర్‌ యెండ్లూరి ప్రభాకర్‌, గుంటూరులో డాక్టర్‌ ఐవీఎల్‌ నరసింహరావు పూర్వ అధ్యక్షులుగా, విశాఖపట్నంలో డాక్టర్‌ జీవీఎస్‌ మూర్తి ప్రస్తుత అధ్యక్షులుగా, కార్యదర్శిగా గుంటూరుకు చెందిన ఐ.శరత్‌చంద్ర పర్యవేక్షణలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. యువ మానసిక వైద్యుల సహకారంతో జరిగిన సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 05:28 AM