SC Categorisation: ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Apr 18 , 2025 | 08:36 PM
SC Categorisation: ఎస్సీ వర్గీకరణను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. అందుకు సంబంధించిన ఆర్డినెన్సును విడుదల చేసింది. అయితే ఈ వర్గీకరణ ఆర్డీనెన్స్‌పై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను ఏపీ గెజిట్‌లో పబ్లిష్ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఏప్రిల్ 18: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను ఏపీ గెజిట్‌లో పబ్లిష్ చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం జీవో ఎంఎస్ నెంబర్ 7ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ విడుదల చేశారు.
గ్రూప్-1లో 12 కులాలకు 1 శాతం, గ్రూప్-2లో 18 కులాలకు 6.5 శాతం,గ్రూప్-3లో 29 కులాలకు 7.5 శాతం చొప్పున రిజర్వేషన్ అమలుకు గురువారం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. బుధవారం ఈ బిల్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం పొందింది.దీంతో న్యాయ శాఖ ఆర్డినెన్స్ నెం 2 ఆఫ్ 2025 జారీ చేసింది.ఈ మేరకు న్యాయ శాఖ సెక్రటరీ గొట్టపు ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
మరోపైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గురువారం సచివాలయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఎటువంటి ఆటంకాలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నందుకు ఆయనకు మంద కృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు.
అలాగే సీఏంవో కార్యాలయంలో..సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర, సిఎం సెక్రటరీ పీఎస్ ప్రద్యుమ్నతోపాటు ముఖ్యమంత్రి అడిషనల్ సెక్రటరీ ఏవీ రాజమౌళితో మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడానికి సహకరించినందుకు వారికి సైతం మంద కృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు.
ఏప్రిల్ 16వ తేదీన వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నింటికీ విద్య, ఉద్యోగాల్లో సమాన, న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Revanth Tour: జపాన్‌లో సీఎం రేవంత్ బిజీ బిజీ.. రుద్రారంకు ఇంటర్నేషనల్ కంపెనీ
Vijayasai Reddy: పార్టీ ఎందుకు వీడానో గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి
Somireddy Chandramohan Reddy: చాలా రోజులైపోయింది చూసి.. నిద్ర పట్టడం లేదు
UttarPradesh: పోలీస్ బదిలీ.. కదిలిన ఊరి జనం
Kishan Reddy: ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి
For AndhraPradesh News And Telugu News