Share News

AP Government: రేషన్‌లో రాగులు

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:31 AM

రేషన్‌ కార్డుదారులకు రాబోయే జూన్‌ నుంచి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా రేషన్‌లో రెండు కేజీలు రాగులు తీసుకునే అవకాశం లభించనుంది

AP Government: రేషన్‌లో రాగులు

జూన్‌ నుంచి పంపిణీకి ఏర్పాట్లు

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): రేషన్‌ లబ్ధిదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండితో పాటు తృణధాన్యాలను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జూన్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కార్డుదారులకు రాగులు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రేషన్‌ బియ్యానికి బదులుగా రాగులు ఉచితంగా పంపిణీ చేయనుంది. అంటే ప్రతినెలా 20 కిలోలబియ్యం తీసుకునే కుటుంబం రెండు కేజీలు రాగులు కావాలనుకుంటే.. ఆ మేరకు బియ్యాన్ని మినహాయిస్తారు. ప్రాథమికంగా సంవత్సరానికి సుమా రు 25 వేల మెట్రిక్‌ టన్నుల రాగులు అవసరమవుతాయని పౌరసరఫరాల సంస్థ అంచనా వేసింది. ఆ మేరకు రాగులు సేకరించేందుకు తాజాగా టెండర్‌ నోటీసు జారీ చేసింది.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 04:33 AM