AP Government : మైక్రో ఇరిగేషన్‌కు సబ్సిడీ ఖరారు
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:51 AM
రాష్ట్రవ్యాప్తంగా డ్రిప్ పరికరాలను ఎస్సీ, ఎస్టీల్లో చిన్న, మధ్యస్థ రైతులకు ఐదెకరాల వరకు 100%, ఇతర చిన్న, మధ్యస్థ రైతులకు 90%, రాయలసీమ, ప్రకాశం జిల్లాల మధ్యస్థ రైతులు..
అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 2025-26లో రైతులకు ఇచ్చే డ్రిప్, స్పింక్లర్ల సబ్సిడీని ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డ్రిప్ పరికరాలను ఎస్సీ, ఎస్టీల్లో చిన్న, మధ్యస్థ రైతులకు ఐదెకరాల వరకు 100%, ఇతర చిన్న, మధ్యస్థ రైతులకు 90%, రాయలసీమ, ప్రకాశం జిల్లాల మధ్యస్థ రైతులు, ఐటీడీఏ పరిధిలో 5-10ఎకరాల ఎస్సీ, ఎస్టీ రైతులకు 90%, కోస్తా జిల్లాల్లో 5-10ఎకరాల మధ్యస్థ రైతులకు 70%, పెద్ద రైతులకు 50% సబ్సిడీ ఇవ్వనున్నారు. స్పింక్లర్లపై అన్ని క్యాటగిరీల రైతులకూ 50% సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీలో 27 నుంచి 33% కేంద్రం, 17 నుంచి 67ు రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.