Share News

Pawan Kalyan promise to students: విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్

ABN , Publish Date - Dec 15 , 2025 | 08:10 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నెల 5వ తేదీన చిలకలూరిపేట మెగా పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శారద జిల్లా పరిషత్ పాఠశాలకు కంప్యూటర్లు, గ్రంథాలయానికి పుస్తకాలు ఇస్తానని మాటిచ్చారు.

Pawan Kalyan promise to students: విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నెల 5వ తేదీన చిలకలూరిపేట మెగా పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శారద జిల్లా పరిషత్ పాఠశాలకు కంప్యూటర్లు, గ్రంథాలయానికి పుస్తకాలు ఇస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ తన సొంత నిధులతో వాటిని ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట శారదా హైస్కూల్‌ లైబ్రరీకి పుస్తకాలు, 25 కంప్యూటర్‌లతో కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ అందించారు (Pawan Kalyan news).


శారదా హైస్కూల్‌లో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ, కలెక్టర్ కృత్తిక శుక్లాతో కలిసి కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ‌ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. చెప్పిన మాట ప్రకారం పాఠశాలకు ఎక్విప్మెంట్ అందించిన డిప్యూటీ సీఎంకు ప్రత్తిపాటు పుల్లారావు ధన్యవాదాలు తెలియజేశారు. పది రోజుల్లోనే తన మాటను నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్‌పై పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానిక నాయకులు ప్రశంసలు కురిపించారు (Pawan Kalyan promise to students).


అలాగే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కృషిని ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు (Andhra Pradesh education news). మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యా శాఖ ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చిందని, చిలకలూరిపేట నియోజకవర్గంలో పాఠశాలల మౌలిక సదుపాయాల కోసం లోకేష్ రూ. 7 కోట్లు కేటాయించారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బయటపడ్డ అమ్మవారి విగ్రహం.. ప్రత్యేక పూజలు

వైసీపీ బైక్ ర్యాలీ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..

For More AP News And Telugu News

Updated Date - Dec 15 , 2025 | 08:10 PM