Share News

Constable Written Exam: ప్రారంభమైన కానిస్టేబుళ్ల రాత పరీక్ష

ABN , Publish Date - Jun 01 , 2025 | 10:20 AM

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్ష ప్రారంభమైంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Constable Written Exam: ప్రారంభమైన కానిస్టేబుళ్ల రాత పరీక్ష
police constable exam 2025

విశాఖపట్నం, జూన్ 1: కానిస్టేబుళ్ల రాత పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. పరీక్ష కేంద్రాల వద్ద బయో మెట్రిక్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అభ్యర్థులను గుర్తించి.. అనంతరం వారిని పరీక్ష కేంద్రాల్లోకి పంపారు. అయితే గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి వారిని అనుమతించారు. అలాగే వారికి మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలు, వాలెట్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించ లేదు. ఈ పరీక్ష ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరగనుంది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఈ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కానిస్టేబుళ్ల పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ఇంత త్వరగా పాకిస్థాన్‌తో ఎందుకు ఒప్పందం చేసుకున్నట్లు..

For Andhrapradesh News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 10:23 AM