AP CM Chandrababu: సూపర్ సిక్స్‌ను ఎగతాళి చేశారు.. సాధ్యం చేసి చూపించాం: ఏపీ సీఎం
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:08 PM
కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఎగతాళి చేశారని, వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారని, అయితే తాము వాటిని అమలు చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీఎంకు స్థానిక నాయుకులు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ఎగతాళి చేశారని, వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారని, అయితే తాము వాటిని అమలు చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అన్నారు. చంద్రబాబు తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీఎంకు స్థానిక నాయుకులు, ప్రజలు అఖండ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. 2047 నాటికి రాష్ట్రంలో ప్రతిఒక్కరి మొహంలో ఆనందం చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు (AP News).
'గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది కానీ చెత్త ఎత్తే కార్యక్రమం చెయ్యలేదు. కూటమి ప్రభుత్వం ఏడు నెలలుగా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇంట్లో చెత్త బయట పడేయటం వలన అంటూ వ్యాధులు ప్రభలుతున్నాయి. అక్టోబర్ రెండో తేదీలోపు 85టన్నుల చెత్తను సేకరిస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోంది. 2047 నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం చూడాలి' అని చంద్రబాబు అన్నారు.
'ఉమ్మడి జిల్లా వాసులు చాలా సౌమ్యులు. ఇలాంటి చోట కూడా గతంలో రౌడీయిజం చేశారు. మేం పెద్దాపురంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంటును ప్రారంభించబోతున్నాం. వర్షాకాలంలో దోమల వల్ల రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. డ్రోన్స్ ఉపయోగించి రాష్ట్రంలో దోమల సమూల నివారణకు చర్యలు తీసుకుంటాం. సూపర్ సిక్స్‌ను ఎగతాళి చేశారు. సాధ్యం కాదు అన్నారు. సాధ్యం చేసి చూపించా. 2027లో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమృత్ పథకంలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో 75 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీటి కుళాయి వేయిస్తాం. ఎన్డీఏకు పెద్దాపురం నియోజకవర్గం కంచుకోట. ఇక్కడ మరొకరికి అవకాశం ఇవ్వకూడద'ని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో విశాఖ వైద్యుడు
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..