Share News

Krishna River Board: ఏపీకి 4.. తెలంగాణకు 10.26 టీఎంసీలు

ABN , Publish Date - May 23 , 2025 | 07:09 AM

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తాజా ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీలు, తెలంగాణకు 10.26 టీఎంసీల తాగునీటి వినియోగానికి అనుమతినిచ్చింది. నాగార్జునసాగర్‌ నుంచి ఏపీకి రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది.

Krishna River Board: ఏపీకి 4.. తెలంగాణకు 10.26 టీఎంసీలు

  • సాగర్‌ నుంచి రాష్ట్రానికి రోజూ 5,500 క్యూసెక్కులు

అమరావతి/హైదరాబాద్‌, మే 22(ఆంధ్రజ్యోతి): తాగునీటి అవసరాల కోసం కృష్ణా బేసిన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ నాలుగు టీఎంసీలు, తెలంగాణ 10.26 టీఎంసీలు వాడుకోవచ్చని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 800 అడుగులు, నాగార్జునసాగర్‌లో 505 అడుగుల దాకా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఏపీ అవసరాల కోసం ఈనెల 22 నుంచి 30 వరకు సాగర్‌ కుడి ప్రధాన కాలువ నుంచి రోజుకు 5,500 క్యూసెక్కులు విడుదల చేయాలని తెలంగాణను ఆదేశించింది. ఇక, జూలై 31 వరకు శ్రీశైలం నుంచి తెలంగాణకు నీటిని విడుదల చేయాలని, కనీస నీటి మట్టం కన్నా దిగువకు పడిపోకుండా చూసుకోవాలని బోర్డు ఏపీని కోరింది. నీటి విడుదలకు సంబంధిత రాష్ట్రాల చీఫ్‌ ఇంజనీర్లు బాధ్యత తీసుకోవాలని, సంయుక్త ప్రకటన విడుదల చేయాలని నిర్దేశించింది.

Updated Date - May 23 , 2025 | 07:10 AM