Ontimitta Temple : ఒంటిమిట్టలో ఆగస్టు నుంచి తిరుమల తరహాలో అన్నదానం
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:44 AM
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో తిరుమల తరహాలో..
తిరుమల, జూలై14(ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో తిరుమల తరహాలో అన్నప్రసాద వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు నుంచి అన్నదానం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనాభవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్, అన్నప్రసాద విభాగాలు సమన్వయంతో అన్నప్రసాద వితరణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఒంటిమిట్టలో ఏప్రిల్11న జరిగిన కోదండరామస్వామి కల్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సూచన మేరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో తెలిపారు.