Share News

ACB Court: లంచం తీసుకున్న ఎస్సై‌కు ఏడేళ్ల జైలు శిక్ష.. ఏసీబీ కోర్టు సంచలన తీర్పు..

ABN , Publish Date - Aug 28 , 2025 | 09:08 PM

ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు ఏసీబీ కోర్టు భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది.

ACB Court: లంచం తీసుకున్న ఎస్సై‌కు ఏడేళ్ల జైలు శిక్ష.. ఏసీబీ కోర్టు సంచలన తీర్పు..
Court

ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్‌‌కు ఏసీబీ కోర్టు (ACB Court) భారీ శిక్ష విధించింది. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2.5 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. విశాఖపట్నంలో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త మంగరాజు, అతని తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లపై వరకట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది (AP News).


కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్‌లో పెద్దయ్య 2015లో ఎస్సైగా పని చేస్తున్న సమయంలో సదరు మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో మంగరాజు, అతని కుటుంబ సభ్యులపై వరకట్నం నిషేధం చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా ఎస్సై తాత్సారం చేశారు. అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మంగరాజు నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.


మంగరాజు నుంచి కానిస్టేబుల్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఎస్సైను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ కేసును విచారించిన ఏసీబీ న్యాయస్థానం ఎస్సైకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారుడికి రూ.2.5 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని కూడా తీర్పునిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుదాఘాతంతో యువకుడు మృతి.. పవన్ కల్యాణ్ విచారం

భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

For AP News And Telugu News

Updated Date - Aug 28 , 2025 | 09:40 PM