Model Primary Schools: స్కూళ్ల స్వరూపం మారెన్
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:42 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. 9,200 మోడల్ ప్రైమరీ స్కూల్స్‌తో పాటు వివిధ రకాలుగా బడులను విభజించి, విద్యను మరింత ప్రభావవంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
9,200 మోడల్ ప్రైమరీ స్కూళ్లు
అందులో ప్రతి తరగతికి ఒక టీచర్
బేసిక్ ప్రైమరీ పాఠశాలలు 19 వేలు
1,557 ఉన్నత పాఠశాలల్లో
1 నుంచి 10 తరగతులు
పాఠశాల విద్యా శాఖ నిర్ణయం
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాలల స్వరూపం మారుతోంది. గతంలో ఆరు రకాల పాఠశాలలుండేవి. అయితే, ఇకపై ఐదు రకాల బడులు ఉండేలా కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడం లక్ష్యంగా మోడల్ ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 9,200 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గ్రామాల్లో ఉన్న రెండు, మూడు ప్రాథమిక పాఠశాలల్లో ఒకదానిని మోడల్ స్కూల్‌గా అప్‌గ్రేడ్ చేస్తారు. ఆ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులకు ఒక్కో టీచర్ చొప్పున ఐదుగురు టీచర్లను ఇస్తారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా హెచ్‌ఎం పోస్టు ఇస్తారు. అవసరమైతే సమీపంలోని మిగులు స్కూల్ అసిస్టెంట్‌ను మోడల్ ప్రైమరీ పాఠశాలకు హెచ్‌ఎంను చేస్తారు. దీనివల్ల ప్రభుత్వ ప్రాథమిక విద్యకు పునరుత్తేజం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుత విధానంలో చాలా ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. విద్యార్థులు తక్కువగా ఉండటంతో టీచర్ల సంఖ్య తగ్గించేశారు. దీంతో ప్రాథమిక పాఠశాలలు మూతపడే పరిస్థితి వస్తోంది. తరగతికి ఒక టీచర్‌ను ఇచ్చి అభివృద్ధి చేస్తే ప్రైవేటు పాఠశాలల తరహాలో విద్యార్థులు చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కొత్తగా 1నుంచి 10 తరగతులు ఉండేలా కొన్ని పాఠశాలలను అందుబాటులోకి తీసుకొస్తోంది. 1,557 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతులు పెడుతోంది.
అలాగే 1 నుంచి 5 తరగతులు ఉండే బేసిక్ ప్రైమరీ స్కూళ్లు 19వేలు ఉంటాయి. వీటిలో ప్రతి తరగతి ఒక టీచర్‌ను కాకుండా 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను ఇస్తారు 20 దాటితే రెండో టీచర్‌ను కేటాయిస్తారు. కేవలం 1, 2 తరగతులు మాత్రమే ఉండే ఫౌండేషనల్ స్కూళ్లు ఐదు వేలు ఉంటాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు 1,200 ఉంటాయి. 7,00 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలల చివరి పనిదినాల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను కేటాయిస్తారు. ఇందుకోసం త్వరలో 117జీవోకు ప్రత్యామ్నాయ జీవోను పాఠశాల విద్యాశాఖ జారీచేస్తుంది. అలాగే ఈ నెలాఖరున టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారు. పదోన్నతుల అనంతరం వచ్చేనెలలో కొత్తగా చేసిన ఉపాధ్యాయ బదిలీల చట్టం ఆధారంగా బదిలీలు చేపడతారు. మే నెలలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తిచేసి జూన్‌లో బడులు తెరిచేనాటికి టీచర్లను సిద్ధంగా ఉంచాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. బడులు తెరిచేముందు రెండురోజులపాటు కొత్త సిలబ్‌సపై టీచర్లకు అవగాహన కల్పిస్తారు. బదిలీల్లో మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించేవారి కోసం ఈనెల 24 నుంచి 26 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మెడికల్ బోర్డులు ఏర్పాటుచేయనున్నారు. టీచర్లు అక్కడ మెడికల్ సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News