Share News

AP CM Chandrababu Naidu: పీ4 పటిష్ఠ అమలుకు ప్రత్యేక సొసైటీ

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:16 AM

పీ4 కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రత్యేక సొసైటీ ఏర్పాటైంది. 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఆగస్టు 15 వరకు లక్ష్యం నిర్దేశించు

AP CM Chandrababu Naidu: పీ4 పటిష్ఠ అమలుకు ప్రత్యేక సొసైటీ

చైర్మన్‌గా సీఎం, వైస్‌ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం

మార్గదర్శులను గుర్తించే బాధ్యత కలెక్టర్లు,

మంత్రులు, ఎమ్మెల్యేలకు

సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన జీరో పావర్టీ-పీ4 కార్యక్రమాన్ని విస్తృతపరిచేలా పటిష్ఠ వ్యవస్థను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పీ4 అమలు కోసం రాష్ట్రస్థాయి సొసైటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సొసైటీకి ముఖ్యమంత్రి చైర్మన్‌గా, డిప్యూటీ సీఎం వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే, సీఈవో, డైరెక్టర్‌, వారికి అనుసంధానంగా కాల్‌సెంటర్‌, టెకీల బృందం, ప్రోగ్రాం బృందం, వింగ్‌ బృందం ఉంటాయి. జిల్లాస్థాయిలో కమిటీకి జిల్లా మంత్రి చైర్మన్‌గా, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉంటారు. గ్రామ, వార్డు విభాగాల్లో సచివాలయాలకు పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ర్టేటివ్‌ సెక్రటరీలు ఆ బాధ్యతలు చూస్తారు. రాష్ట్రస్థాయి సొసైటీ ఏర్పాటు, పీ4 పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రతిజిల్లా కలెక్టర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు మార్గదర్శులను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని చెప్పారు. దాతలు ఎవరు, ఎంత మొత్తం ఇచ్చారు, ఇంకెంత సాయం బంగారు కుటుంబాలకు అవసరం అనే విషయాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే పథకం అమలు పారదర్శకంగా ఉంటుందని, పీ4పై విశ్వాసం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.


టార్గెట్‌ 5 లక్షల కుటుంబాలు: ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణం గా మార్గదర్శి, బంగారు కుటుంబాల నమోదు చేపడుతున్నట్టు సమీక్షలో అధికారులు వివరించారు. ఇందుకోసం మిలాప్‌, డొనేట్‌కార్ట్‌, రంగ్‌దే సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాయని చెప్పారు. సాయం చేయదలచుకొన్న వారి కి ఆన్‌లైన్‌ ద్వారా కూడా సాయమందించే ఏర్పాటు చేస్తామన్నారు. దాతలు ముందుగా పీ4 ప్లాట్‌ఫామ్‌ ద్వారా లాగిన్‌ అవడంతో ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పా రు. ఆగస్టు నాటికి నమోదు ప్రక్రియ పూర్తిచేసి సాయం కార్యరూపం దాల్చేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు నిర్దేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..

అమ్మాయితో రాజకీయమా..

సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

For More AP News and Telugu News

Updated Date - Apr 09 , 2025 | 05:37 AM