Share News

AP Cyclone: తుపాను నేపథ్యంలో ఏపీలో బీచ్‌లు మూసివేత, తిరుపతిలో పునరావాస ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 25 , 2025 | 09:56 PM

తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోని బీచ్‌లు, సూర్యలంక బీచ్‌తో పాటు చీరాల పరిధిలోని బీచ్‌లు సైతం మూసివేశారు. తిరుపతిలో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాసితులకు అక్కడే వసతి, ఆహార సదుపాయాలు ఏర్పాటు చేశారు.

AP Cyclone: తుపాను నేపథ్యంలో ఏపీలో బీచ్‌లు మూసివేత, తిరుపతిలో పునరావాస ఏర్పాట్లు
Andhra Pradesh cyclone

ఏపీ వెదర్ అప్డేట్: తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోని బీచ్‌లు, సూర్యలంక బీచ్‌తో పాటు చీరాల పరిధిలోని బీచ్‌లు సైతం మూసివేశారు. తుఫాను కారణంగా సోమవారం నుండి తాత్కాలికంగా మూసివేత ఉంటుందని, భక్తులు యాత్రికులు సముద్ర తీరానికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తుపాను నేపథ్యంలో తిరుపతిలో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వాసితులకు అక్కడే వసతి, ఆహారం సదుపాయాలు ఏర్పాటు చేశారు. సాయం కొరకు 24 గంటలు టోల్ ఫ్రీ నంబర్లు 0877 - 2256776, 9000822909 అందుబాటులోకి తెచ్చారు. వర్షాల వలన త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున, నీటి సాంద్రత పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్టు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.


తిరుపతిలో ఎక్కడైనా నీటి కలుషితం జరిగితే సరఫరా ఆపి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి, నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని, మ్యాన్ హోల్ ఓపెన్ చేసిన ప్రాంతాల్లోను, అండర్ బ్రిడ్జిల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపునీరు ఆగకుండా మోటార్లతో నీరు పంపింగ్ చేయాలని ఆదేశించారు. పురాతన భవనాల్లో నివాసం ఉండొద్దని ప్రజలకు సూచించారు.


ఇవి కూడా చదవండి..

మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు

బెంగళూరులో 30 బస్సులు సీజ్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 25 , 2025 | 10:01 PM