AP Chief Secretary: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవీకాలం పొడిగింపు
ABN , Publish Date - Nov 29 , 2025 | 02:04 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ మరో మూడు నెలలు కొనసాగనున్నారు. ఆయన పదవి కాలం మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కాలాన్ని..
అమరావతి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పదవి కాలం మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెలాఖరుతో విజయానంద్ పదవీకాలం ముగియనుంది. అయితే, అతని పదవీకాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ రంగంలో 14 సంవత్సరాల అనుభవం కలిగిన అధికారి విజయానంద్. 2024 డిసెంబర్‌లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 'ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024' రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పాలసీ రాష్ట్రాన్ని 160 GW రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా మార్చే లక్ష్యాన్ని పెట్టుకుంది. అలాగే, తుఫానుల సమయంలో ఎనర్జీ సరఫరాను నిర్వహించడంలో ఆయన తీరుకు ప్రశంసలు అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News