YCP : వైసీపీ పాపాలు..!
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:31 AM
వైసీపీ హయాంలో భూఅక్రమాలకు అంతేలేదన్నది బహిరంగ రహస్యమే. భూకబ్జాలతో పేట్రేగిపోయారు. ఆ పార్టీకి చెందిన నేతలు.. రియల్టర్ల అవతారమెత్తి నిబంధనలకు తిలోదకాలిచ్చారు. యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు వేసి, అడ్డంగా దోచుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. కూటమి ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)ను అమలులోకి తేవడంతో అక్రమాలు బయటపడుతున్నాయి. 2019-24 మఽధ్య వైసీపీ పాలనలో అనంతపురం హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ (అహుడా) ...
అహుడా పరిధిలో కుప్పలు తెప్పలుగా అనధికార లే అవుట్లు
700కిపైగా అనుమతులు లేనివే..
అధిక భాగం వైసీపీ హయాంలో వేసినవే..
క్రమబద్ధీకరణకు ససేమిరా
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
అనంతపురం క్లాక్‌టవర్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో భూఅక్రమాలకు అంతేలేదన్నది బహిరంగ రహస్యమే. భూకబ్జాలతో పేట్రేగిపోయారు. ఆ పార్టీకి చెందిన నేతలు.. రియల్టర్ల అవతారమెత్తి నిబంధనలకు తిలోదకాలిచ్చారు. యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు వేసి, అడ్డంగా దోచుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. కూటమి ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)ను అమలులోకి తేవడంతో అక్రమాలు బయటపడుతున్నాయి. 2019-24 మఽధ్య వైసీపీ పాలనలో అనంతపురం హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ (అహుడా) పరిధిలో 700కిపైగా లేఅవుట్లు 8వేల ఎకరాల్లో విస్తరించినట్లు సమాచారం. వీటిలో 80శాతానికిపైగా వైసీపీ నేతలకు చెందినవే కావడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వంలోనే విజిలెన్స
అధికారులు.. అనధికార లేఅవుట్లపై నివేదిక ఇచ్చినా బుట్టదాఖలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అనధికార లేఅవుట్లను కట్టడి చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వెంచర్లను క్రమబద్ధీకరించే పనిలో పడింది. ఈ ప్రక్రియలో అసలు విషయం బయటకు వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అహుడాలోనే పనిచేస్తున్న ఓ ఇంజనీరు.. వైసీపీ నేతలతో అంటకాగినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చినా ఆ ఇంజనీరును అహుడాలోనే కొనసాగిస్తుండడం గమనార్హం. ఎల్‌ఆర్‌ఎ్‌సను పూర్తి స్థాయిలో తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో 700కిపైగా ఉన్న అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొన్న 40వేల మందికిపైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని అహుడా వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి
అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్లతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. డెవల్‌పమెంట్ చార్జీలు, ఫీజులు చెల్లించకుండా అక్రమంగా లేఅవుట్లు వేసేశారు. కొందరు అధికారులు.. వైసీపీ నేతలతో కుమ్మక్కై యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అహుడాలో పనిచేసే ఓ ఇంజనీరు.. వైసీపీ నాయకులతో బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే చర్చ సాగుతోంది. గతంలో ఆ ఇంజనీరు అనంత నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ విభాగంలో పనిచేసిన సమయంలోనే భారీగా అక్రమార్జనకు మరిగారనే పేరు మూటగట్టుకున్నారు. తననెవరూ ఏమీ చేసుకోలేరనే ఽధీమాతోనే అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఆ ఇంజనీరు పనిచేస్తుండడం గమనార్హం.
నగర శివారులోనే అధికం
అనంతపురం నగర శివారులోనే అత్యధికంగా అనధికార లేఅవుట్లు వెలిశాయి. గోవిందంపల్లిలో సర్వే నంబర్లు 78, 145, 165, వడియంపేట గ్రామ పంచాయతీ పొడరాళ్ల పరిధి సర్వే నంబర్ల 295, 279, 84, 85, 87లో అనధికారికంగా వేసిన లేఅవుట్లలో రాళ్లను ఇటీవల అహుడా అధికారులు తొలగించారు. నారాయణపురం పంచాయతీలోని సర్వే నంబరు 104, 202లో (10.8 ఎకరాలు), సర్వే నంబరు 142,145లలో (2.8 ఎకరాలు). నరసనాయునికుంట పంచాయతీలో సర్వే నంబరు 111, 117లలో (6.5 ఎకరాలు), సర్వే నంబరు 113లో ఎకరం, సర్వే నంబరు 121లో (6.4 ఎకరాలు), సర్వే నంబరు 124, 126లలో (4.6ఎకరాలు), కక్కలపల్లి పంచాయతీలో సర్వే నంబరు 191లో (8ఎకరాలు), సర్వే నంబరు 183లో (2.1ఎకరాలు), సోము లదొడ్డి పంచాయతీలో సర్వే నంబరు 62లో (11.5) ఎకరాల్లో వేసిన అనధికార లేఅవుట్లలోని రాళ్లను ఆయా పంచాయతీ కార్యదర్శులతో కలిసి అహుడా ప్లానింగ్ అధికారులు తొలగించారు.
అన్నింటినీ క్రమబద్ధీకరించుకోవాల్సిందే
-టీసీ వరుణ్, అహుడా చైర్మన
అహుడా పరిధిలోని అనధికార లేఅవుట్లు అన్నింటినీ క్రమబద్ధీకరించుకోవాల్సిందే. లేదంటే బ్లాక్‌లిస్టులో పెట్టేస్తాం. అహుడా పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న అనధికారి లేఅవుట్ల వివరాలను సేకరించి, ఎల్‌ఆర్‌ఎస్ వర్తింపజేసేలా ప్రణాళికలు రూపొందించాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..