Share News

TDP: ఎన్టీఆర్‌ వైద్యసేవల విషయంలో వైసీపీ దుష్ప్రచారం

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:08 AM

ఎన్టీఆర్‌ వైద్యసేవల విషయం లో ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని టీడీపీ ని యోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మొత్తం 10 మందికి రూ.9.95లక్షలు సీఎం సహా యనిధి మంజూరైంది. ఆ చెక్కులను ఆయన సోమ వారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో లబ్ధిదా రులకు అందజేశారు.

TDP: ఎన్టీఆర్‌ వైద్యసేవల విషయంలో వైసీపీ దుష్ప్రచారం
Paritalasreeram presenting the CMRF cheques

పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ వైద్యసేవల విషయం లో ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని టీడీపీ ని యోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మొత్తం 10 మందికి రూ.9.95లక్షలు సీఎం సహా యనిధి మంజూరైంది. ఆ చెక్కులను ఆయన సోమ వారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో లబ్ధిదా రులకు అందజేశారు. ఎన్టీఆర్‌ వైద్యసేవలు అందక ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొంది ఆర్థికంగా ఇ బ్బందులు పడుతున్న వారిని సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ము ఖ్యమంత్రి ఆదుకుంటున్నారన్నారు. అయితే కొన్ని రోజులుగా మెడికల్‌ కళాశాలల నిర్మాణాలు,


ఎన్టీఆర్‌ వైద్యసేవల విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మ వద్దన్నారు. నాయకులు క మ తం కాటమయ్య, చింతలపల్లి మహేశచౌదరి, ఫణి కుమార్‌, సంధా రా ఘవ, నాగూర్‌హుస్సేన, జింకా పురుషోత్తం, కొత్త పేట ఆది, విజయసారథి, కేతా శీన, పోతుకుంట రవి తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూసమస్యల పట్ల నిర్లక్ష్యం వద్దు

తాడిమర్రి: రెవెన్యూ సమస్యలను పరిష్క రించడంలో నిర్లక్ష్యం తగదని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ అన్నారు. ఆయన సో మవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహ సీల్దార్‌ భాస్కర్‌రెడ్డితో పలు అంశాలపై చర్చిం చా రు. రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దడంలో అ ధికారులు నిర్లక్ష్యవ వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రీవెన్సకు వెళ్లిన పరిటాల శ్రీరామ్‌కు పలు వురు రైతులు వివిధ సమస్యలను విన్నవించారు. స్పందించిన శ్రీరామ్‌ ఈనెల 30 లోగా ఇక్కడే పరిష్కారమయ్యే సమస్యలను పరి ష్కరించాలని లేదంటే ఒకటో తేదీన కలెక్టరేట్‌లో తెలియజేయాల్సి వస్తుందని హెచ్చరించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 16 , 2025 | 12:08 AM