Share News

MLA: వైసీపీ ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్‌

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:14 AM

గత వైసీపీ పాలనలో అమలు చేసిన ప్రతి స్కీమ్‌లోను స్కామ్‌ దాగి ఉందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మండిపడ్డారు. శనివారం మండలకేంద్రంలో శనివారం సహకార సంఘం అధ్యక్షుడు చెన్నక్రిష్ణ ప్రమాణ స్వీకారోత్సవానికి, పార్టీ కార్యాల యం ప్రారంభానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ పాలన లో ప్రతి పథకంలో అర్హుల కంటే వైసీ పీ నాయకులకే అధికంగా లబ్ధి చేరుకూరిందన్నారు.

MLA: వైసీపీ ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్‌
MLA speaking in the meeting

ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి

బుక్కపట్నం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలనలో అమలు చేసిన ప్రతి స్కీమ్‌లోను స్కామ్‌ దాగి ఉందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మండిపడ్డారు. శనివారం మండలకేంద్రంలో శనివారం సహకార సంఘం అధ్యక్షుడు చెన్నక్రిష్ణ ప్రమాణ స్వీకారోత్సవానికి, పార్టీ కార్యాల యం ప్రారంభానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ పాలన లో ప్రతి పథకంలో అర్హుల కంటే వైసీ పీ నాయకులకే అధికంగా లబ్ధి చేరుకూరిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అలాంటి ప రిస్థితుల నుంచి ఒకొక్క అడుగు ముందు కేస్తున్నట్లు తెలిపారు. ని యోజకవ ర్గాన్ని రాష్ట్రంలో మోడల్‌గా తయారు చేస్తామన్నారు. అనంత రం సింగల్‌విండో అధ్యక్షుడు చెన్నక్రిష్ణ, డైరెక్టర్లు గంగాధర్‌, జయరాముల చేత ప్రమాణ స్వీకరం చేయించారు. మండలకేంద్రంలో పార్టీ కార్యాల యం ప్రా రంభించారు. టీడీపీ నాయకులు చింతా మల్లిరెడ్డి, గంగాధర్‌, క్రిష్ణాపురం, గూనిపల్లి, పుట్టపర్తి సొసైటీ అధ్యక్షుడు అప్పస్వామి నాయు డు, ప్రభాకర్‌రెడ్డి, కొమ్మినేని వెంకట్రాముడు, టౌన కన్వీనర్‌ ఎర్ర కేసి, జనసేన ఇనచార్జ్‌ పత్తిచంద్రశేఖర్‌, కురబ కార్పొరేషన డైరెక్టర్‌ శ్రీనివా సులు, నాయకులు సయ్యద్‌బాషా, లావణ్య, తదితరులు పాల్గొన్నా రు. అలాగే మండలంలోని సీకాయకుంటపల్లికి చెందిన వైసీపీ నాయకు డు, రిటైర్ట్‌ టీచర్‌ సూర్యనారాయణ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే, మాజీ మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 10 , 2025 | 12:14 AM