భజే.. బొజ్జ గణపయ్యా..
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:49 AM
పార్వతీ తనయుడు తొలిపూజ అందుకున్నాడు. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వీధివీధినా బొజ్జ గణపయ్య కొలువై భక్తకోటికి కనువిందు చేశాడు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రజలు వేడుకలను ఘనంగా చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో కేఎ్‌సఆర్ ప్రభుత్వ బాలికల కళాశాల ముందు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసిన మండపానికి పతాకాన్ని ఆవిష్కరించి, వేడుకలను ప్రారంభించారు. అనంతరం గణనాథుని ..
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి
వాడవాడలా వెలసిన విగ్రహాలు
అనంతపురం టౌన, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): పార్వతీ తనయుడు తొలిపూజ అందుకున్నాడు. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వీధివీధినా బొజ్జ గణపయ్య కొలువై భక్తకోటికి కనువిందు చేశాడు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రజలు వేడుకలను ఘనంగా చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో కేఎ్‌సఆర్ ప్రభుత్వ బాలికల కళాశాల ముందు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసిన మండపానికి పతాకాన్ని ఆవిష్కరించి, వేడుకలను ప్రారంభించారు. అనంతరం గణనాథుని ఉత్సవ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. గజాననుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రికి విగ్రహాల కదలికలతో కర్ణాటక రాష్ట్రం కారణగిరి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ పురాణగాథను ప్రదర్శించారు. చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది ప్రత్యేకించి ఆపరేషన సిందూర్ ఘట్టాలను ప్రదర్శించగా, మిగిలిన చోట్ల పర్యావరణ ప్రాశస్థ్యాన్ని తెలియజేస్తూ ఎకో ఫ్రెండ్లీ వినాయకులను కొలువుదీర్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా వాడవాడలా వెలసిన వినాయక మండపాలన్నింటిలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా... చిన్న, పెద్ద తేడాలేకుండా అందరూ గణనాథుని మండపాలకు చేరుకుని, వివిధ రూపాల్లో కొలువైన స్వామివారిని దర్శించుకున్నారు.