TDP: కృష్ణా జలాలకు పూజలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:41 AM
మండలపరిధిలోని కొక్కంటి క్రాస్ సమీపంలో హంద్రీ నీవా కాలువలో శనివారం కృష్ణాజలాలకు కూటమి నాయకులు జలహారతి ఇచ్చారు. కాలువ వద్ద గంగమ్మకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టారు. ఘనంగా జలహారతి నిర్వహించారు.
తనకల్లు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని కొక్కంటి క్రాస్ సమీపంలో హంద్రీ నీవా కాలువలో శనివారం కృష్ణాజలాలకు కూటమి నాయకులు జలహారతి ఇచ్చారు. కాలువ వద్ద గంగమ్మకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టారు. ఘనంగా జలహారతి నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ రెడ్డిశేఖర్‌రెడ్డి, నాయకులు కావడి ప్రవీణ్‌కుమార్, ఈశ్వర్‌రెడ్డి, గోవిందు, శంకర్‌నాయుడు, బాగేపల్లి చలపతి, తోట సరోజమ్మ, సోంపాల్యం నాగభూషణం, మధుకర్‌నాయుడు, రమణా రెడ్డి, వెంకటరమణ, దస్తగిరి, క్రిష్ణానాయక్, ఉత్తన్ననాయక్, రమణ, రెడ్డెప్పరెడ్డి, జనసేన రమణ తదితరులు పాల్గొన్నారు.