ICDS: అధ్వానంగా అంగనవాడీల పనితీరు
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:31 AM
ఐసీడీఎస్ ధర్మవరం ప్రాజెక్ట్ పరిధిలో అంగనవాడీ కేంద్రాల పనితీరు అధ్వానంగా మారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సరఫరా చేస్తున్న పౌషికాహారాన్ని కూడా చిన్నా రులకు సక్రమంగా అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మ వరం ఐసీడీఎస్ ప్రాజెక్టులో 230 అంగనవాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 110 వరకు అద్దె భవనాల్లో నడుపుతున్నారు. చాలా కేంద్రాలను ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతోనే నడుపుతున్నారు.
చిన్నారులకు సరిగా అందని పౌష్టికాహారం
కొరవడిన పర్యవేక్షణ
ధర్మవరం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఐసీడీఎస్ ధర్మవరం ప్రాజెక్ట్ పరిధిలో అంగనవాడీ కేంద్రాల పనితీరు అధ్వానంగా మారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సరఫరా చేస్తున్న పౌషికాహారాన్ని కూడా చిన్నా రులకు సక్రమంగా అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మ వరం ఐసీడీఎస్ ప్రాజెక్టులో 230 అంగనవాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 110 వరకు అద్దె భవనాల్లో నడుపుతున్నారు. చాలా కేంద్రాలను ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతోనే నడుపుతున్నారు. అలాంటి కేంద్రాలకు రోజు ఆ యాలు వస్తారు తప్ప అంగనవాడీ కార్యకర్తలు చుట్టపు చూపుగా వచ్చి వె ళ్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు బాహాటంగానే అంటున్నారు. అంతేకా కుండా మధ్యాహ్న భోజనం వండకుండానే, వండినట్టు రికార్డుల్లో నమో దు చేస్తున్నట్టు సమాచారం. తక్కువ మంది పిల్లలు ఉన్నా ఎక్కువ మంది వస్తున్నట్టు రికార్డుల్లో నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
కూరగాయలు, గ్యాస్‌సిలిండర్ల బిల్లులను ఐసీడీఎస్ ఉన్నతాధికారి మంజూ రు చేసి అందులోనూ కమిషన్లు తీసుకుం టున్నట్టు ఆరోపణ లు లేకపోలేదు. మండలంలోని తుంపర్తి, మోటుమర్ల, దర్శిన మలతో పాటు పలుగ్రామాలలో అంగనవాడీ కేంద్రాల పనితీ రు చాలా అధ్వానంగా ఉన్నట్లు తెలుస్తోంది. మోటుమర్ల కేంద్రంలో ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆయా తప్ప కార్యకర్త సక్రమంగా అందుబాటులో ఉండరని తెలుస్తోంది. అదేవిధంగా తుంపర్తి గ్రామంలోని రెండు కేంద్రాలను కలిసి ఒకే కేంద్రంలో నిర్వహి స్తున్నారని, అందులోనూ ముగ్గురు పిల్లలే ఉన్నారని గ్రామ స్థుల ద్వారా సమాచారం. ఆ కేంద్రాలకు ఇద్దరు కార్యకర్తలు, మినీ అంగనవాడీ కార్యకర్త ఉన్నారు. వారిలో మినీ అంగన వాడీ కార్యకర్త మాత్రమే కేంద్రానికి రోజు వస్తారని గ్రామస్థులు ఆరోపణ. ఇవేకాక పట్టణ, మండల పరిధిలో ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తే పలు కేంద్రాల పనితీరు బయటపడుతుందని పలువు రు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే వ్యవస్థ అధ్వానంగా తయారవుతోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాం - ప్రమీల, పీడీ, ఐసీడీఎస్
ధర్మవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కొన్ని కేంద్రాలలో కార్యకర్తల పనితీరు అధ్వానంగా ఉండటంకానీ, ధర్మవరం ఐసీడీఎస్ అదికారి కార్యక ర్తలతో కుమ్మక్కై బిల్లులో కమిషన్లు తీసుకుంటున్నట్టు గానీ మా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయిలో వెళ్లి అలాంటి కేంద్రాలను తనిఖీ చేస్తాం. ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకుంటాం.