Share News

QUARTERS: పాముల బెడద

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:39 PM

మండలకేంద్రంలో పాడుబడిన పోలీస్‌ క్వార్టర్స్‌ ప్రాంతంలో ముళ్లకంపలు, పిచ్చికంపలు పెరిగి పోవడంతో చుట్టుపక ్కల కాపురాలున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు పాములు బయటకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఇళ్లకు వాకిళ్లు వేసుకొని, బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు.

QUARTERS: పాముల బెడద
Police quarters area damaged by trees and barbed wire

అపరిశుభ్రంగా పాత పోలీస్‌ కార్టర్స్‌ ప్రాంతం

భయాందోళనలో సమీప ప్రాంత నివాసులు

తనకల్లు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో పాడుబడిన పోలీస్‌ క్వార్టర్స్‌ ప్రాంతంలో ముళ్లకంపలు, పిచ్చికంపలు పెరిగి పోవడంతో చుట్టుపక ్కల కాపురాలున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు పాములు బయటకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఇళ్లకు వాకిళ్లు వేసుకొని, బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు. మండల కేంద్రమైన తనకల్లులో బ్రిటిష్‌ పాలనా కాలంలో పోలీస్‌ స్టేషన ఏర్పాటు చేశారు. అప్పట్లో పోలీసుల నివాసం కోసం క్వార్టర్స్‌ నిర్మించారు. కాల క్రమేణా అవి పాడుపడిపోయాయి. అనంతరం పోలీసుల కోసం స్టేషన ఆవరణలోనే నూతనంగా క్వార్టర్స్‌ నియమించారు. ప్రస్తుతం అవి కూడా కూలిపోయే దశలో ఉన్నాయి. అంతేగాకుండా పాడుబడిన పోలీసుల క్వార్టర్స్‌ చుట్టూ చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి.


పాత క్వా ర్టర్స్‌కు ఉన్న రాళ్ల గోడలు కూడా కూలిపోయాయి. దీంతో ఆ ప్రాం తం పాములకు నిలయంగా మారింది. దీంతో పోలీస్‌ స్టేషన పాత క్వార్టర్స్‌ చుట్టూ కాపురాలు ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. చుట్టపక్కల కాపురాలు ఉన్న వారు కొంతకాలం క్రితం వరకు పోలీస్‌ స్టేషన ఆవరణం నుంచి మెయిన రోడ్డు లోకి నడి చివెళ్లే వాళ్లు. కానీ కొద్దికాలంగా పోలీసులు ఆ ఆవరణం చుట్టూ ముళ్లకంపలు ఏర్పాటు చేయడంతో.. పాలీసు స్టేషన ఆవరణంలోకి ఎవరూ అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆ ప్రాం తమంతా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. కూలిపోయిన గోడలు, పెరిగిపోయిన పిచ్చి మొక్కలతో ఆ ప్రాంతం పాములకు నిలయంగా మారిం దని చట్టుపక్కల కాపురాలు ఉన్న వారు అంటున్నారు. ప్రతిరోజు ఎవరికో ఒకరికి వివిధ రకాల పాములు కనిపిస్తున్నాయని వారు భయాం దోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిదులు స్పందించి పాడుబడిన పోలీస్‌ క్వార్టర్స్‌ను తొలగించి చుట్టూ ప్రహరీ నిర్మించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం- కృష్ణమూర్తిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి

తనకల్లులో పాడుబడిన పోలీస్‌ క్వార్టర్స్‌ నుంచి చుట్టు పక్కల ఇళ్లలోకి పాములు వెళ్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఇప్పుడు విషయం తెలిసింది. సమస్య పరిష్కారానికి పోలీసులతో కలిసి మా వంతు కృషి చేస్తాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 30 , 2025 | 11:39 PM