Share News

COLLECTOR: మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించాలి

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:35 PM

మహిళల వినూత్న కా ర్యక్రమాలతో, వ్యాపార వేత్తలుగా రాణించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ మహిళా సంఘ సభ్యులకు సూచించారు. పుట్టపర్తి సాయి ఆరామం ఫంక్షన హాలులో మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా సమాఖ్య నాలుగో వార్షిక మహాజన సభ నిర్వహించారు.

COLLECTOR: మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించాలి
Collector speaking at the meeting

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

పుట్టపర్తి టౌన, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మహిళల వినూత్న కా ర్యక్రమాలతో, వ్యాపార వేత్తలుగా రాణించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ మహిళా సంఘ సభ్యులకు సూచించారు. పుట్టపర్తి సాయి ఆరామం ఫంక్షన హాలులో మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా సమాఖ్య నాలుగో వార్షిక మహాజన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ... మహిళా సంఘాల సభ్యుల స్ఫూర్తిని కొనియాడారు. మహిళా సంఘాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా స హాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ నరసయ్య మాట్లాడుతూ వినూత్న కార్యక్రమాల ద్వారా మహి ళల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోష ణ వనిత, వాణిజ్య వనిత, అక్షర వనిత వంటి కార్యక్రమాలను జిల్లా సమాఖ్య అనుమతితో ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సమత మాట్లాడుతూ చెత్తతో సంపద సృష్టి, స్వర్ణాంధ్ర కార్యక్రమాల విజయానికి మహిళా సంఘాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సమాఖ్య ప్రతినిధులు, తమ విజయగాథలను సభ ఎదుట వినిపించారు.


లక్ష్మీ నరసమ్మ(అమడగూరు), నల్లచెరువు అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సరోజ మ్మ (తనకల్లు), అశ్వని(చిలమత్తూరు) తమ జీవనోపాధి కార్యక్రమాల అనుభవాలను పంచుకున్నారు. కలెక్టర్‌ వారిని అభినందించారు. పెను కొండ ఎంపీడీఓ నరేష్‌ బయోచార్‌, సూర్యఘర్‌ కార్యక్రమాల్లో మహిళా సంఘాలు ఎలా లబ్ధిపొందవచ్చో వివరించారు. జిల్లా సమాఖ్య అధ్యక్షు రాలు రాజేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడవ వార్షిక మహాసభలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు. తరువాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని కార్యదర్శి రాములమ్మ చదివి వినిపించారు. ప్రగతి నివేదికకు సభ్యులందరూ ఆమోదం తెలిపారు. అలాగే 2024-25 సంవత్సరంలో జిల్లా సమాఖ్య సభ్యులందరూ ఆడిట్‌పై చర్చించి ఆమోదించారు. 2025-26 మార్చి వరకు చేపట్టవలసిన కార్య క్రమాలను సబ్జెక్టు వారీగా ఆమోదించారు. కార్యక్రమంలో 32 మండలా ల సమాఖ్య పదాధికారులు, డీపీఎంలు సత్యనారాయణ, రామమోహన, అరుణ, స్ర్తీనిధి ఏజీఎం హనుమేష్‌, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 23 , 2025 | 11:35 PM