TDP: సభకు మహిళలు తరలిరావాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:42 AM
అనంతపురంలో ఈనెల 10న జరగనున్న సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ సభకు మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, అమ లాపురం ఎమ్మెల్యే ఆనందరావు పిలుపు నిచ్చారు. పట్టణ సమీపంలోని చిగిచెర్ల రోడ్డులో ఉన్న పద్మావతి కల్యాణమండపంలో సోమవారం సమావేశం నిర్వహించారు.
పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే ఆనందరావు పిలుపు
ధర్మవరం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ఈనెల 10న జరగనున్న సూపర్‌సిక్స్- సూపర్‌హిట్ సభకు మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్, అమ లాపురం ఎమ్మెల్యే ఆనందరావు పిలుపు నిచ్చారు. పట్టణ సమీపంలోని చిగిచెర్ల రోడ్డులో ఉన్న పద్మావతి కల్యాణమండపంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాలశ్రీరామ్, ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ... నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున మహి ళలు తరలివచ్చి సీఎం సభను విజయవంతం చేద్దామన్నారు. ప్రతి గ్రా మం, వార్డులోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్క మహిళ హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. సీఎం సభకు వచ్చే ప్రతి ఒక్కరికి భోజనం, తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవా లన్నారు. ఏపీసీడ్స్ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ కమతం కాటమయ్య, నాయకులు చింతలపల్లి మహేశచౌదరి, పరిశే సుధాకర్, ఫణికుమార్, నాగూర్‌హుస్సేన, పురుషోత్తంగౌడ్, భీమనేనిప్రసాద్‌నాయుడు, గొట్లూరు శీన, విజయసారథి, అమరా సుఽధాకర్ పాల్గొన్నారు.