Share News

COLLECTOR: కుటుంబానికి వెన్నెముక మహిళ : కలెక్టర్‌

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:30 AM

మహిళ కుటుంబానికి వెన్నె ముక లాంటిదని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు. మహిళలు ఆరో గ్యం గా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటుందన్నారు. మం డల కేంద్రంలోని సీహెచసీలో స్వస్థ్‌ నారీ సశక్తి పరివార్‌ అభియాన కార్య క్రమాన్ని బుధవారం డీఎంహెచఓ ఫైరోజ్‌బేగం, డీసీహెచఎస్‌ మధుసూ దన ఆధ్వర్యంలో డాక్టర్‌ అశ్వత్థకుమార్‌ నిర్వ హించారు.

COLLECTOR: కుటుంబానికి వెన్నెముక మహిళ : కలెక్టర్‌
Collector Shyamprasad talking to the elderly

కొత్తచెరువు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): మహిళ కుటుంబానికి వెన్నె ముక లాంటిదని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు. మహిళలు ఆరో గ్యం గా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటుందన్నారు. మం డల కేంద్రంలోని సీహెచసీలో స్వస్థ్‌ నారీ సశక్తి పరివార్‌ అభియాన కార్య క్రమాన్ని బుధవారం డీఎంహెచఓ ఫైరోజ్‌బేగం, డీసీహెచఎస్‌ మధుసూ దన ఆధ్వర్యంలో డాక్టర్‌ అశ్వత్థకుమార్‌ నిర్వ హించారు. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించారు. జిల్లా వ్యాప్తంగా నెలలో రెండు లేక మూడు వైద్యశిబిరాలను నిర్వహించాలని డీఎంహెచఓకు, వైద్యులకు సూ చించారు. ఈ వైద్యశిబిరాలకు వచ్చే రోగులకు ముందస్తుగానే పరీక్షలు నిర్వహించి ఆ జబ్బులపై వారికి అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలన్నారు. మహిళలు ఆరోగ్యం ఉండాలన్న సదుద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వస్థ్‌ నారీ సశక్తి పరివార్‌ అభియానకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. అనం తరం శిబిరానికి వచ్చిన వృద్ధులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవల గురించి వివరాలను అడిగితెలుసుకున్నారు. రక్తదాన శిబిరాన్ని పరిశీలించి, యువత పెద్దసంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లల జాయ్‌వెస్లీ, భార్గవ్‌, వరలక్ష్మి, హారిక, జయశ్రీ, ఎంపీడీఓ నటరాజ్‌, మాజీ ఎంపీపీ వాణి, టీడీపీ పట్టణ కన్వీనర్‌ వలిపి శీన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 12:30 AM