CORN: మొక్కజొన్న పంటకు గాలివాన దెబ్బ
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:34 PM
మండల కేంద్రం సమీ పంలో చంద్రశేఖర్ అనే రైతు తన ఎకరం పొలంలో మొక్కజొన్న పంట సాగుచేశాడు. అయితే రెండు రోజుల క్రితం ఈదురుగా లులతో కురిసిన వర్షానికి ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంట నేలకొరిగింది.
నల్లమాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం సమీ పంలో చంద్రశేఖర్ అనే రైతు తన ఎకరం పొలంలో మొక్కజొన్న పంట సాగుచేశాడు. అయితే రెండు రోజుల క్రితం ఈదురుగా లులతో కురిసిన వర్షానికి ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఏపుగా పెరగడంతో పాటు మంచి దిగుబడి వచ్చే సమయంలో పంట నెలకొరిగి నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వారం పది రోజులలో కోత కోయాల్సి ఉందని, పంట పూర్తిగా నేలకొరగడంతో పెట్టిన పెట్టుబడి చేతికి రాదన్నా డు. సంబంధిత శాఖ అధికారులు పంటను పరిశీలించి, ప్రభు త్వం నుంచి నష్ట పరిహారం అందించాలని ఆయన కోరాడు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....