ROAD: ఈ రోడ్లకు మోక్షమెప్పుడో..?
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:19 PM
మండలంలోని పలు రోడ్లు గుంతల మయమై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తి అయినా నల్లమాడ మండలంలో ఆ రోడ్లలో మార్పులేదు. మండలంలోని శీకివారిపల్లికి రెడ్డిపల్లి - మలక వేమల ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల తారు రోడ్డ్డును 15 యేళ్ల క్రితం అప్పటి టిడీపీ ప్రభుత్వంలో వేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదు. రోడ్డంతా గుంతలు పడి అ ధ్వానంగా మారింది.

- గుంతలమయమై అధ్వానంగా మారిన వైనం
- అవస్థలు పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు
నల్లమాడ, జూన 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు రోడ్లు గుంతల మయమై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తి అయినా నల్లమాడ మండలంలో ఆ రోడ్లలో మార్పులేదు. మండలంలోని శీకివారిపల్లికి రెడ్డిపల్లి - మలక వేమల ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల తారు రోడ్డ్డును 15 యేళ్ల క్రితం అప్పటి టిడీపీ ప్రభుత్వంలో వేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదు. రోడ్డంతా గుంతలు పడి అ ధ్వానంగా మారింది. ఆటోలు, ద్విచక్రవాహనాల్లో వెళ్తుంటే ఎగుడు దిగుడు గా ఉన్న ఆ రోడ్డులో ఎక్కడ జారిపడతామో అనే భయం వేస్తుందని గ్రామస్థులు వాపోతున్నారు. శీకి వారిపల్లిలో బడా రాజకీయ నాయకులు ఉన్నా, ఆ రోడ్డు పరిస్థితి మార్చే నాథుడే లేరని గ్రామస్థులు వాపోతు న్నారు. ఆ గ్రామస్తులకు రా త్రిపూట ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే రాత్రి ఆ సమయంలో గ్రామానికి ఆటోలు రావు. దీంతో ద్విచక్రవాహ నాల్లోనే ఆ గుంతల రోడ్డులో వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు.
చౌటకుంటపల్లి లింక్ రోడ్డు ఇలా...
నల్లమాడ - కదిరి - దొన్నికోట ప్రధాన డబుల్‌రోడ్డుకు చౌటకుంటపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో లింక్ ఉంది. ఈ తారు రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది. గతంలో కదిరి నుంచి దొన్నికోట మీదుగా నల్ల మాడకు వేళ్లే ప్రతి బస్సు ఈ లింక్ రోడ్డు మీదుగా నల్లమాడకు చేరేవి. ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో ద్విచక్రవాహనాలు కూడా వెళ్ల డానికి వీలు లేకుండా ఉంది. దీంతో ప్రస్తుతం కదిరి నుంచి నల్లమాడకు వెళ్లే బస్సులు ఈ రోడ్డు మీదుగా రాకుండా ఎద్దులవాండ్లపల్లి తండా మీ దుగా వెళుతున్నాయి. దీంతో చౌటకుంటపల్లి, ఎద్దులవాండ్లపల్లి గ్రామ స్థు లు కదిరికి వెళ్లాలంటే ఎద్దులవారిపల్లితండాకు గానీ, నల్లమాడ క్రాస్‌కు గా వెళ్లాల్సి వస్తోంది. అలాగే ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువు తున్న చౌటకుంటపల్లికి చెందిన 60 మంది విద్యార్థులు బస్సు వసతి లేకపోవడం తో నల్లమాడ జిల్లా పరిషత పాఠశాలకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.
ఇప్పటికీ బండి బాటే గతి
రాగానిపల్లి నుంచి రాగానిపల్లి తండాకు రెండు కిలోమీటర్ల బండి బాట ఉంది. దాదాపు తండా ఏర్పడి నప్పటి నుంచి రాగానిపల్లి నుంచి ఈ బండి బాటలోనే తండాకు వెళ్తున్నా రు. ఎన్నికల్లో తండాకు వెళ్లిన నాయకులు తారు లేక సిమెంటు రోడ్డు వేస్తామని హామీలు ఇస్తున్నారే కానీ, ఏళ్లు గడుస్తున్నా వారి హామీలు నెరవేరడం లేదని తండా వాసులు వాపోతున్నారు. అంతేగాకుండా ఈ బండి బాటకు ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగి, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. వర్షం వస్తే బండిబాటలో నీరు నిలువ ఉండి ద్విచక్ర వాహనాలే గాకుండా నడవడానికి కూడా వీలు లేకుండా పోతుందని అంటున్నారు. అలాగే నల్లమాడ నుంచి సోము గుట్టపల్లి, కొండ్రవారిపల్లి, కుటాలపల్లితండా వరకు ఉన్న తారు రోడ్డు పూర్తిగా గంతలమయం. నల్లమాడ - పుట్టపర్తి ప్రధాన రోడ్డు ్డనుంచి పెమనకుంటపల్లి వరకు రెండు కిలోమీటర్ల తారురోడ్డు, నల్లమాడ నుంచి చెరువువాండ్లపల్లి, కొత్తపల్లి వెళ్లే రోడ్డు అడుగుకోగుంత, మూరకో గుం తలాగా దర్శనమిస్తాయి. గత ప్రభుత్వంలో ఈ రోడ్లలో గుంతలకు తట్టెడు మట్టికూడా వేయక పోవడంతో మరింత గుంతలు ఏర్పాడ్డయని ఆయా గ్రామస్థులు మండి పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా, ఇంతవరకు పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.