OFFICE: ఈ కార్యాలయానికి దారెట్లా..!
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:14 PM
పట్టణంలోని ట్రెజరీ కా ర్యాలయం ఎదుట రెవెన్యూ అధికారులు కాలువల్లాంటి రెండు గుంతలు తవ్వించారు. కార్యాలయ ఆవరణంలో ప్రవేశ ద్వారం నుంచి ట్రెజరీ కార్యాలయం వరకు ఒకటి, ఇటు ఆధార్ కేంద్రం నుంచి రెడెన్యూ కార్యాలయం వరకు రెండు వైపుల గుంతలు త వ్వించారు. దీంతో డ్రెజరీ కార్యాలయానికి వెళ్లేందుకు పింఛన దారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
కదిరి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ట్రెజరీ కా ర్యాలయం ఎదుట రెవెన్యూ అధికారులు కాలువల్లాంటి రెండు గుంతలు తవ్వించారు. కార్యాలయ ఆవరణంలో ప్రవేశ ద్వారం నుంచి ట్రెజరీ కార్యాలయం వరకు ఒకటి, ఇటు ఆధార్ కేంద్రం నుంచి రెడెన్యూ కార్యాలయం వరకు రెండు వైపుల గుంతలు త వ్వించారు. దీంతో డ్రెజరీ కార్యాలయానికి వెళ్లేందుకు పింఛన దారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. డ్రెజరీ కార్యాలయా నికి ముఖ్యంగా పింఛనదారులు వెళ్తుంటారు. వీరందరూ చాలా మటుకు వయస్సు పైబడిన వారే ఉంటారు. వీరందరూ కాలువ గుంతలు దాటుకుని వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు ఆ గుంతలన పూడ్చి ట్రెజరీ కార్యాలయానికి దారి కల్పించాలని వృద్ధులు కోరుతున్నారు.