PURITY: స్వచ్ఛత ఎక్కడ..?
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:00 AM
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మండల పట్టణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ప్రతినెలా మూడో శనివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో బాగంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరి శుభ్ర వాతావరణాన్ని నెలకొల్పేందుకు అధికారులను సైతం ఇందులో భాగస్వాములను చేసింది. అమలు చేయాల్సిన అధికారులే పట్టించుకోక పోవడంతో ఈ కార్యక్రమం నీరుగారి పోతోంది.
పుట్టపర్తిరూరల్/ కొత్తచెరువు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మండల పట్టణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ప్రతినెలా మూడో శనివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో బాగంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరి శుభ్ర వాతావరణాన్ని నెలకొల్పేందుకు అధికారులను సైతం ఇందులో భాగస్వాములను చేసింది. అమలు చేయాల్సిన అధికారులే పట్టించుకోక పోవడంతో ఈ కార్యక్రమం నీరుగారి పోతోంది. జిల్లాకేంద్రంలోని సూ పర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా పలు జిల్లా ప్రభుత్వ కార్యాల యాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కార్యాలయాల చుట్టూ పిచ్చిమొ క్కలు చెత్తాచెదారంతో పేరుకుపోయింది. కార్యాలయాల్లోని చెత్తను అక్క డే పడేస్తున్నారు. దీనికి తోడు చెత్తకు నిప్పుపెట్టి చేతులు దులిపేసు కుంటున్నారు. ఇది చూసి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రభుత్వం ప్రజలకు వారధులుగా ఉన్న అధి కారులే ఇలా వ్యవహరిస్తే ఇక ప్రభుత్వ ఆశయాలకు ఎలా న్యాయం జరుగుతుందని అను కుంటున్నారు. కొత్తచెరువు మండల కేంద్రంలోని గంగమ్మగుడివీధిలో సీసీరోడ్డుపై మురు గునీరు నిత్యం పారుతూ ఉంది. సమీప ఇళ్లలోని ప్రజలు మురుగునీటిని రోడ్లపైకి వదల డంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు గ్రామస్థులు అంటున్నారు.. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు, మండల పరిషత అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించు కోలేదు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ కాలువలను ఏర్పాటుచేయాలని పలుమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో రోడ్డుపైనే మురుగునీరు పారు తుండటంతో ప్రజలు నడవాడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు అమలు చేస్తే సమస్యలకు పరిష్కారం చూపిన వారవుతారని ప్రజలు భావిస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....