FOOLD COMMISSION :ఏమిటీ ఆహారం ?
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:44 PM
కాలం చెల్లిన పౌష్టికారాన్ని గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు ఎలా పంపిణీ చేస్తారని రాష్ట్ర ఫుడ్ కమిషన సభ్యురాలు గంజిమాల దేవి ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ నగర్ పాఠశాలలో ఉన్న అంగనవాడీ కేం ద్రాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. అంగనవాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పౌష్టిక ఆహారంపై తేదీ, నెల, సంవత్సరం పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని అంగనవాడీ టీచర్లకు సూచించా రు.
కాలం చెల్లిన పౌష్టికాహారం ఎలా పంపిణీ చేస్తారు?
ఐసీడీఎస్ అధికారులపై ఫుడ్ కమిషన సభ్యురాలి ఆగ్రహం
కొత్తచెరువు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): కాలం చెల్లిన పౌష్టికారాన్ని గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు ఎలా పంపిణీ చేస్తారని రాష్ట్ర ఫుడ్ కమిషన సభ్యురాలు గంజిమాల దేవి ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ నగర్ పాఠశాలలో ఉన్న అంగనవాడీ కేం ద్రాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. అంగనవాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పౌష్టిక ఆహారంపై తేదీ, నెల, సంవత్సరం పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని అంగనవాడీ టీచర్లకు సూచించా రు. కాలపరిమితి ముగియడానికి కేవలం ఐదు రోజులున్న అటుకులను గర్భిణులకు ఎలా పంపిణీ చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. కాంట్రా క్టర్‌కు ఫోన చేసి మళ్లీ ఇలా జరిగితే లైసెన్స రద్దు చేస్తామని హెచ్చరిం చారు. పిల్లలకు వండిన ఆహారాన్ని రుచి చూశారు. గర్భిణులకు సా మూహిక సీమంతాలను నిర్వహించారు.
అనంతరం గాంధీనగర్ పాఠ శాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతగా చేసిన ఏజెన్సీ నిర్వాహకులను ఆమె శాలువాలతో సత్కరిం చారు. తర్వాత బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలో చేసిన మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. ఆమె వెంట విద్యా శాఖ ఏడీ విజయ్ మోహన, ఎంఈఓ జ యచంద్ర, ఐసీడీఎస్ సీడీపీఓ జయంతి, సూపర్ వైజర్లు రజిత, భారతి, అంగన వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
పుట్టపర్తి రూరల్: మునిసిపాలిటీ పరిధిలోని ఎనములపల్లి- 2 అంగనవాడీ కేంద్రాన్ని గంజిమాల దేవి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అం గనవాడీ కేంద్రంలో ఫుడ్ స్టాక్ రిజిస్టర్ నిర్వహణ, కోడిగ్రుడ్ల పరిమాణం సక్రమంగా ఉండటంపై సంతృప్తి వ్య క్తం చేశారు. అనంతరం ఆమె ముని సిపల్ పరిధిలోని కుమ్మరిపేట రేషన షాపు (కోడ్ 1249038)ను పరిశీలించారు. రేషనకార్డుదారులకు నిత్యావసర వస్తువు ల సరఫరాను పరిశీలించారు. జిల్లాలో ప్రజలకు నాణ్యమైన పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గంజిమాలదేవి పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....