MP :పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటాం: ఎంపీ అంబికా
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:01 AM
స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటామని ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ భరోసానిచ్చారు. పారిశుధ్య కార్మికులకు మద్దతుగా ఆస్పత్రి వద్ద శనివారం సీఐటీయూ, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకులు కలిసి ధర్నా నిర్వహించారు.
అనంతపురం వైద్యం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటామని ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ భరోసానిచ్చారు. పారిశుధ్య కార్మికులకు మద్దతుగా ఆస్పత్రి వద్ద శనివారం సీఐటీయూ, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకులు కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, జిల్లా కోశాధికారి నాగమణి, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేహరి మాట్లాడుతూ.. కార్మిక శాఖ నిబంధనల మేరకు 50 ఏళ్ల వయసు పైబడిన కార్మికులను తొలగించే హక్కు నిర్వాహకులకు లేదన్నారు.
ఈ అంశంపై కోర్టుకెళ్లడం జరిగిందని, త్వరలోనే న్యాయస్థానం తీర్పునిస్తుందని తెలిపారు. అయితే నిబంధనలు విస్మరిస్తూ పారిశుధ్య కార్మికులను తొలగిస్తామని నిర్వాహకులు సొంత నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఆ సమయంలోనే ఆస్పత్రికి వచ్చిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు వారు సమస్యలను తెలియజేశారు. ఇందుకు స్పందించిన ఎంపీ మాట్లాడుతూ.. 50 ఏళ్ల వయసు నిబంధనను తొలగించేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకే్‌షతో చర్చిస్తామని అన్నారు. ఎవరూ ఆందోళనలు చెందకండని, కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ముర్తుజా, నాగరాజు, ఏసురత్నం, సురే్‌షబాబు, రామిరెడ్డి, రామకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..