MLA: సమస్యను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:43 PM
మండలపరిధిలోని కటారుపల్లిలోని క్రాస్‌లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) వద్ద నెలకొన్న స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ గ్రామస్థులకు తెలిపారు. ఖబ్బం నరసింహస్వామి ద్వారం స్థలం వివాదాన్ని పరిష్కరించాలని కటారుపల్లి పంచాయతీ వా సులు గత ప్రజావేదికలో ఇచ్చిన అర్జీపై స్పందించిన ఎమ్మెల్యే శనివా రం అక్కడికి వెళ్లి పరిశీలించారు.
ఎమ్మెల్యే కందికుంట
ఖబ్బం నరసింహస్వామి ద్వారం స్థలం పరిశీలన
గాండ్లపెంట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని కటారుపల్లిలోని క్రాస్‌లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) వద్ద నెలకొన్న స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ గ్రామస్థులకు తెలిపారు. ఖబ్బం నరసింహస్వామి ద్వారం స్థలం వివాదాన్ని పరిష్కరించాలని కటారుపల్లి పంచాయతీ వా సులు గత ప్రజావేదికలో ఇచ్చిన అర్జీపై స్పందించిన ఎమ్మెల్యే శనివా రం అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ముద్దన్నగారిపల్లి గ్రామస్థులు మాట్లాడుతూ... కటారుపల్లి పంచా యతీలోని దోరణాల, ముద్దన్నగారిపల్లి, జురుకోరుపల్లి, గజ్జలవాండ్లపల్లి గ్రామస్థులు ఖబ్బం నరసింహస్వామికి విశేష పూజలు చేసేవారన్నారు. ఈ ద్వారం గుండా భక్తులు నరసింహ స్వామిని దర్శించుకునేవారని
ఎమ్మెల్యేకి తెలిపారు. అలాగే కటారుపల్లి క్రాస్‌లోని కొందరు శ్మశానవాటికను పక్కన ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు అయితే ఆ రెండూ కేజీబీవీ ఆవరణలోకి వెళ్లాయన్నారు. దీనిపై ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కొలతలు వేసి వివరాలు ఇవ్వా లని సూచించారు. ఎవరూ ఆవేశాలకు గురై సమస్యలను పెంచుకోవద్ద ని, కటారుపల్లి క్రాస్ వాసులకు శ్మశాన వాటిక స్థల సమస్యను పరిష్క రిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాబురావు, ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి, వీఆర్‌ఓలు, సర్వేయర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
విద్యతోనే ఉన్నత శిఖరాలు: ఎమ్మెల్యే
విద్యార్థి దశలో క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కేజీబీవీ విద్యా ర్థులకు సూచించారు. ఆయన శనివారం కేజీబీవీని సందర్శించి విద్యా ర్థులతో ముచ్చటించారు. పాఠశాలలో విద్య, వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తోందని, అందులో భాగంగానే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం సొమ్మును ప్రతి ఏటా జమ చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ విద్యపై దృష్టి సారించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. పాఠశాల ఎస్‌ఓ దుర్గ, సింగిల్ విండో చైర్మన రామాంజులరెడ్డి, నాయకులు నరసింహులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....