UREA: అందరికి యూరియా అందిస్తాం: ఆర్డీఓ
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:33 AM
రైతులు ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని, కావాల్సినంత యూరియా అందజేస్తామని ఆర్డీఓ వీవీఎస్ శర్మ పేర్కొన్నారు. ఆయన మండలంలోని కొర్తికోట గ్రా మంలో బుధవారం యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరపున కొర్తికోట రైతులకు 6.30 మెట్రిక్ టన్నుల యూరియాను అందించామన్నారు. రైతులు ఇబ్బందు లు పడాల్సిన అవసరం లేదన్నారు.
తనకల్లు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని, కావాల్సినంత యూరియా అందజేస్తామని ఆర్డీఓ వీవీఎస్ శర్మ పేర్కొన్నారు. ఆయన మండలంలోని కొర్తికోట గ్రా మంలో బుధవారం యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరపున కొర్తికోట రైతులకు 6.30 మెట్రిక్ టన్నుల యూరియాను అందించామన్నారు. రైతులు ఇబ్బందు లు పడాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు కావల్సినంత యూరి యా రైతు సేవా కేంద్రాల ద్వారా అందిస్తామన్నారు. బస్తా యూరియాకు బదులుగా రూ. 225తో 500 ఎంఎల్ నానో యూరియా వాడాలని సూచించారు. నానోయూరియా తక్కుధరలతో అధిక దిగుబడి ఇస్తుందని తెలిపారు. ఏడీఏ సనావుల్లా, తహసీల్దార్ షాబుద్దీన, ఏఓ భారతి, ఆర్‌ఐ అశోక్‌చక్రవర్తినాయుడు, ఏఈఓలు, వీహెచఎలు, రైతులు పాల్గొన్నారు.