CHAIRMAN: విద్యార్థులకు చేయూతనిస్తాం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:42 AM
శాలివాహన కుటుంబాల్లోని చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో చదువును అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారని ఏపీ శాలివాహన కార్పొరేషన చైర్మన పేరేపి ఈశ్వర్ పేర్కొన్నారు. చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు చేయూత అందిస్తామన్నారు. మండలంలోని వంకమద్దిలో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
శాలివాహన కార్పొరేషన చైర్మన
నంబులపూలకుంట, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): శాలివాహన కుటుంబాల్లోని చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో చదువును అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారని ఏపీ శాలివాహన కార్పొరేషన చైర్మన పేరేపి ఈశ్వర్ పేర్కొన్నారు. చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు చేయూత అందిస్తామన్నారు. మండలంలోని వంకమద్దిలో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీ పీ మండల ప్రధాన కార్యదర్శి నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఈ కార్యక్రమానికి మండలంలోని శాలివాహనులు తరలి వచ్చారు. గ్రామానికి చెరుకున్న చైర్మనకు ఘనంగా స్వాగతం పలి కారు. ఆయన శాలివాహనల జీవన పరిస్థితులపై జిల్లా మం త్రి సవిత దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశా లను కల్పించాలని, కార్పొరేషన ద్వారా నిధులు మంజూరు చేయిం చాలని శాలివాహనలు ఆయనకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ కుళ్లాయమ్మ, అరుణ, నాగేంద్ర, గంగాధర్, సూర్యనారా యణ, నాగార్జున, రెడ్డెప్ప, చంద్ర, ఓబున్న, బయన్న, నాగరాజు, వేణు, బాబు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....