MINISTER: కబ్జాకు గురైన ప్రదేశాలను గుర్తిస్తున్నాం
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:04 AM
గతంలో పట్టణంలో కబ్జాకు గురైన ప్రదేశాలను గుర్తించి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని... ప్రజ లకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు. ఆయన శనివారం పట్ట ణంలోని రాంనగర్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చు ట్టా రు.
ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం
అమరావతిపై అసత్య ప్రచారాలు: మంత్రి సత్యకుమార్
ధర్మవరం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): గతంలో పట్టణంలో కబ్జాకు గురైన ప్రదేశాలను గుర్తించి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని... ప్రజ లకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు. ఆయన శనివారం పట్ట ణంలోని రాంనగర్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చు ట్టా రు. పట్టణ ప్రజల సౌకర్యార్థం 15వ ఆర్థిక ఆర్థిక సంఘం నిధులు రూ. 122.87లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే ఈ పనుల్లో రోడ్ల నిర్మాణం, డ్రైన్ల ఏర్పాటు, తాగునీటి పైపులైన, వాకింగ్ ట్రాక్ నిర్మాణం వంటి వాటికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూదనరెడ్డితో కలిసి శం కుస్థాపన చేశారు. అలాగే అమృత2.0, అమృత ఫేజ్-22 పథకాల కింద రూ. కోట్లతో పెద్దస్థాయిలో చేపట్టిన తాగునీటి నిల్వ ట్యాంకులు నిర్మాణ ద శలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ... గతంలో పట్టణంలో కబ్జాకు గురైన ప్రదేశాలను గుర్తించి, వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్కుల ఏర్పాటు వల్ల పట్టణం మరింత అందంగా మారుతోందన్నారు.
అలాగే మార్కెట్‌యార్డ్‌లో ఏర్పాటు చేయనున్న మెగా హ్యాండ్‌లూమ్ క్ల స్టర్ స్థలాన్ని వ్యవసాయశాఖ నుంచి జౌళి శాఖకు ఇప్పటికే బదిలీచే శామన్నారు. త్వరలో ఢిల్లీ నుండి ప్రత్యేక బృందం వచ్చి ఆ స్థలాన్ని పరి శీలించాక, టెండర్లను పిలుస్తామన్నారు. దాదాపు 22 వేల మందికి ఉపాధి కలిగించే ఈ ప్రాజెక్టుపై కొందరు తప్పుడు ప్రచారాలు దుర దృష్టకర మన్నారు. అలాగే రాజధాని అమరావతిలో నీరు నిల్వ ఉంటోందంటూ అ సత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమి షనర్ ప్రమోద్‌కుమార్, ఈఈ సాయికృష్ణ, డీఈలు వీరేశ, ప్రభుదాస్, చేనే త ప్రముఖులు, టీడీపీ నాయకులు సంధా రాఘవ, జింకా పురుషోత్తం, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి సాకే ఓబుళేశు, పట్టణ అధ్యక్షుడు జింకా చంద్ర, జనసేన నాయకులు బెస్త శ్రీనివాసులు పాల్గొన్నారు.
స్వచ్ఛతపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించాలి
పరిశుభ్రమైన పరిసరాలు సమాజాభివృద్ధికి పునాది అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్తపేట ప్రభుత్వ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వ చ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు మంత్రి విద్యార్థు లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ... పరి శుభ్రమైన పరిసరాలు సమాజాభివృద్దికి బాటలు వేస్తాయన్నారు. చిన్న ప్పటి నుంచే విద్యార్థులు శుభ్రత, పర్యావరణ పరిరక్షణపట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అందరం కలికట్టుగా స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధిద్ధామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, పాఠశాలహెచఎం రాంప్రసాద్, పీడీ అశ్విని తదితరులుపాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....