HLC Water: బొప్పేపల్లి చెరువుకు హెచ్చెల్సీ నీరు
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:18 AM
మండలంలోని బొప్పేపల్లి రైతుల ఏళ్ల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. మండలంలోని సుబ్బరాయసాగర్ నుంచి 29వ డిసి్ట్రబ్యూటరీ కాలువ ద్వారా బొప్పేపల్లి చెరువుకు తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) నీటి విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ మేరకు బుధవారం జీఓ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కృషి ఫలించింది. సుబ్బరాయసాగర్ నుంచి బొప్పేపల్లి చెరువుకు 0.100 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు ఎమ్మె...
జీఓ విడుదల
ఫలించిన ఎమ్మెల్యే కృషి
సాకారమైన మండలవాసుల ఏళ్ల కల
పుట్లూరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొప్పేపల్లి రైతుల ఏళ్ల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. మండలంలోని సుబ్బరాయసాగర్ నుంచి 29వ డిసి్ట్రబ్యూటరీ కాలువ ద్వారా బొప్పేపల్లి చెరువుకు తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) నీటి విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ మేరకు బుధవారం జీఓ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కృషి ఫలించింది. సుబ్బరాయసాగర్ నుంచి బొప్పేపల్లి చెరువుకు 0.100 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. నీరు వస్తే 4వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. 17 గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది. ఆయా గ్రామాల పరిధిలో ఎండిపోయిన బోరుబావులు రీచార్జ్ అయ్యే అవకాశం ఉంది. 2019లో
వైసీపీ అధికారంలోకి వచ్చాక కాలువ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పట్లో ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో హెచ్చెల్సీ నీరు విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వీటిపై శ్రద్ధపెట్టారు. కాలువపై పదిరోజుల క్రితం కలియతిరిగి సమస్యను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. హెచ్చెల్సీ నీరు బొప్పేపల్లి చెరువుకు విడుదల చేయించేందుకు కృషిచేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అంచనాలు తయారు చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ద్వారా ఆమోదముద్ర వేయించారు. ఆ మేరకు జీఓ విడుదల కావడంతో పుట్లూరు, యల్లనూరు మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.