Share News

ROAD: రోడ్డుపై గుంతల్లో నీరు

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:08 AM

మండల పరిధిలోని లోచర్లలో పెనుకొండ రహదారి పక్కనే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. పాఠశాలకు ఎదురుగా రోడ్డు గుంతల మయం కావడంతో ఇటీవల వర్షాల కు ఆ గుంతల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.

ROAD: రోడ్డుపై గుంతల్లో నీరు
Rainwater standing on the road at Locherla School

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు , ప్రజలు

కొత్తచెరువు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని లోచర్లలో పెనుకొండ రహదారి పక్కనే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. పాఠశాలకు ఎదురుగా రోడ్డు గుంతల మయం కావడంతో ఇటీవల వర్షాల కు ఆ గుంతల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతి రోజు ఈ రహదారి గుండా కియా కార్ల పరిశ్రమకు వందల సంఖ్యలో బస్సులు నిత్యం వెళ్తుంటాయి. ఆ బస్సులు వెళ్లే సమయంలో గుంతలలోని నీరు తమపై పడుతోందని విద్యార్థులు వాపోతు న్నారు. రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ప్రమాదాలకు సైతం గురవుతున్నారని గ్రామస్థులు పేర్కొం టున్నారు. పలుమార్లు ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ అధికారులకు విన్నవించినా పట్టించు కోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల వద్ద రోడ్డుపై పడిన గుంతలను పూడ్చాలని గ్రామస్థులు, విద్యార్థులు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 21 , 2025 | 12:08 AM