TDP: హంద్రీనీవా నీరు వచ్చేలా చూడండి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:09 AM
తమ గ్రామానికి హంద్రీ నీవా కాలువ ద్వారా సాగు, తాగునీరు వచ్చేలా చూడాలని మండలం లోని ఓబుళనాయునిపల్లి గ్రామస్థులు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్‌కు వినతులు అందించారు. ‘మీ సమస్య-మా బాధ్యత’ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం మండలంలోని ఓబుళనాయునిపల్లి లో నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను ఆర్జీల రూపంలో స్వీక రించారు.
‘మీ సమస్య- మా బాధ్యత’లో పరిటాల శ్రీరామ్‌కు వినతి
ధర్మవరం రూరల్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): తమ గ్రామానికి హంద్రీ నీవా కాలువ ద్వారా సాగు, తాగునీరు వచ్చేలా చూడాలని మండలం లోని ఓబుళనాయునిపల్లి గ్రామస్థులు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్‌కు వినతులు అందించారు. ‘మీ సమస్య-మా బాధ్యత’ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం మండలంలోని ఓబుళనాయునిపల్లి లో నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలను ఆర్జీల రూపంలో స్వీక రించారు. గ్రామంలో దాదాపు 450బోర్లు ఉన్నా, చాలావాటిలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని గ్రామస్థులు ఆయనకు విన్నవించారు. తమ గ్రామానికి హాంద్రీనీవా ద్వారా నీరందించాలని కోరారు. మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్తానని శ్రీరామ్ తెలిపారు. అలాగే గ్రామానికి సత్యసాయి తాగునీటి పథకం, ఇతర సమస్యలు పరి ష్కరిస్తా నని తెలిపారు. టీడీపీ నాయకులు మహేష్‌చౌదరి, పోతుకుం ట లక్ష్మ న్న, మేకల రామాంజినేయులు, విజయసారథి, జంగం నరసింహులు, గడ్డంరాయుడు, కొమ్మినేని సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి: మండల పరిధిలోని యర్రాయపల్లిలో మంగళవారం ‘మీ సమస్య - మా బాధ్యత’ కార్యక్రమాన్ని పరిటాల శ్రీరామ్ నిర్వహిం చారు. ప్రజలు నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీక రించారు. అనంత రం ఇటీవల అనారోగ్యవతో మరణించిన అంగనవాడీ కార్యకర్త ఇంటికి వెళ్లి, ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. టీడీపీ నాయకులు చల్లా శ్రీనివాసులు, జక్కంపూటి సత్యనారాయణ, రమణ, కేశవ, సూరి, కార్యకర్తలు పాల్గొన్నరు. అలాగే మండలపరిధిలోని దంపెట్ల గ్రామంలో మండల కన్వీనర్ నారాయణరెడ్డి అధ్యక్షతన మీ సమస్య - మా బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....